Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్- పాకిస్తాన్ మ్యాచ్ పై షాకింగ్ ట్విస్ట్: లాహోర్ లో అనూహ్య పరిణామం.. !!

టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడం వివాదాలకు కేంద్రబిందువు అయింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ కో హోస్ట్ శ్రీలంక సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును అభ్యర్థించింది గానీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు. పట్టిన పట్టు వీడట్లేదు. భారత్ తో ఆడదలచుకోలేదంటూ స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫే ప్రకటించారంటే- దీన్ని ఆ దేశం ఎంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక, పర్యాటక నష్టాలు వాటిల్లుతాయని పేర్కొంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు తమ దేశంలో అత్యంత ఆదరణ ఉంటుందని, ఇది రద్దయితే టికెట్లు అమ్ముడుపోవని, స్పాన్సరర్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తారని, పర్యాటకరంగం కూడా నష్టపోతుందని పేర్కొంది.

Lahore Meeting with PCB BCB with ICC Signal Possible Resolution for India vs Pakistan T20 Showdown

ఈ పరిణామాల్లో అనూహ్య కోణం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖ్వాజాతో ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కీలక సమావేశం నిర్వహించారు. భారత్‌- పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమావేశ ఫొటోలను పీసీబీ విడుదల చేసింది.

ఇమ్రాన్ ఖ్వాజా.. సింగపూర్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసోసియేట్ మెంబర్ డైరెక్టర్‌గా ఆయనకు ఐసీసీ బోర్డులో ఓటు హక్కు సైతం ఉంది. ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఏకంగా లాహోర్ కు వచ్చారు. భారత్- పాకిస్తాన్ హై ప్రొఫైల్ మ్యాచ్‌ను కాపాడే విషయంలో ఈ భేటీ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఐసీసీ సైతం ఆశావహ దృక్పథంతో ఉంది. 'ఫోర్స్ మేజ్యూర్' నిబంధనపై ఐసీసీ వివరణ కోరడంతో పాకిస్తాన్ ఇప్పుడు వెనకడుగు వేసింది. బాయ్‌కాట్‌ను విరమించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పంపిన ఇమెయిల్ తర్వాత పరిస్థితులు మారాయి. మొహసిన్ నఖ్వీతో చర్చల అనంతరం ఇమ్రాన్ ఖ్వాజా, అమీనుల్ ఇస్లాం.. ఐసీసీ పాలక మండలి సభ్యులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+