స్టేడియంలోనే రొమాన్స్: ముద్దుల వర్షం కురిపించిన ప్రియురాలు! (వీడియో)
FIFA World Cup 2026: 2010 తర్వాత తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం స్డేడియంలో ఆటగాళ్లు, అభిమానులు జరుపుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. స్పెయిన్ స్టార్ ప్లేయర్ లామిన్ యమాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేడియంలో అభిమానులు, ఆటగాళ్లందరూ సంబరాలు మునిగి ఉండగా.. లామిన్ యమాల్, అతని ప్రియురాలు ఇనెస్ గార్సియా శాంటోస్ స్టేడియంలో ప్రేమతో దగ్గరయ్యారు. ఇనెస్, లామిన్ యమాల్‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టుకోగా.. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రొమాంటిక్‌గా మారిన లామిన్ యమాల్ ప్రియురాలు
స్పెయిన్ ప్రపంచ కప్ విజయం తర్వాత యువ స్పానిష్ స్టార్ లామిన్ యమాల్‌కు సంబంధించిన ఆ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. స్పెయిన్ జట్టు సంబరాలు చేసుకున్న సమయంలో యమాల్ ప్రియురాలు స్టేడియంలోకి పరిగెత్తుకొచ్చి అందరి ముందు అతడిని కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంది. ఆ క్షణం ఇప్పుడు ఆన్‌లైన్లో ట్రెండింగ్ లో ఉంది. మ్యాచ్ తర్వాత కెమెరా లామిన్ యమాల్‌పై దృష్టి సారించింది. సంబరాల తర్వాత 19 ఏళ్ల ఆ సూపర్‌స్టార్ తన ప్రియురాలితో కలిసి మైదానంలో కూర్చున్నాడు. ఒక ఫోటోగ్రాఫర్ వారి ఫోటోలు తీస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఇనెస్ గార్సియా శాంటోస్ లేచి యమాల్‌ను ముద్దు పెట్టుకుంది.

ఫన్నీగా స్పందించిన అభిమానులు
వైరల్ అవుతున్న ఆ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కెమెరా యమాల్ వైపు తిరగగానే అతని ప్రియురాలు ఆ అవకాశాన్ని వదులుకోలేదని చాలా మంది యూజర్లు వ్యాఖ్యానించారు. కొందరు అయితే దీనిని మొత్తం ప్రపంచ కప్‌లోనే అత్యంత మధురమైన, చిరస్మరణీయమైన వేడుక అని కూడా అభివర్ణించారు.ఫిఫా ప్రపంచ కప్ సమయంలో ఇనెస్ తరచుగా స్టాండ్స్‌లో ఉండి స్పానిష్ జట్టును ఉత్సాహపరుస్తూ, సోషల్ మీడియాలో లామిన్ యమాల్ గురించి పోస్టులు పంచుకుంటూ కనిపించింది. ఈ జంట మే 2026లో జరిగిన ఒక ఎఫ్‌సీ బార్సిలోనా కార్యక్రమంలో తమ సంబంధాన్ని అధికారికంగా బహిరంగపరిచారు.
After the Spain WorldCup victory Yamal’s girl catches the camera zooming in on HIM only 😂💀 So she hops up quick, pulls him in for that kiss, and whispers “It’s gonna be a LONG night when we get home” 😏
— KumoriRaver (@kumoriRaver) July 20, 2026
If this is true love or free ticket to fame I wonder . pic.twitter.com/MP9dOdrEzZ
ఇనెస్ గార్సియా శాంటోస్ ఎవరు?
ఇనెస్ గార్సియా శాంటోస్ ఓ స్పానిష్ ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె సెవిల్లాకు చెందినది. ఫుట్‌బాల్ ఆటగాడు లామిన్ యమాల్‌తో తన సంబంధాన్ని బహిరంగంగా వెల్లడించిన తర్వాత ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications