Ind-NZ ODI: నితీష్ రెడ్డిపై టీమిండియా కోచ్ అసహనం..! ఎన్ని అవకాశాలిచ్చినా..!
భారత్-న్యూజీలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలవ్వడం అభిమానుల్ని నిరాశపరిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో గౌరవ ప్రదమైన స్కోరు సాధించినా గిల్ సేన ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఈ మ్యాచ్ లో అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్ స్ధానంలో చోటు దక్కించుకున్న ఆంధ్రా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పేలవ ప్రదర్శనతో నిరాశపర్చడం టీమ్ మేనేజ్ మెంట్ లోనూ అసంతృప్తి నింపింది.
రాజ్ కోట్ లో కివీస్ తో జరిగిన రెండో వన్డేలో కేవలం 20 పరుగులే చేయడం, రెండు ఓవర్లు వేసినా వికెట్ తీయకపోవడంపై అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కటే విమర్శలు గుప్పించాడు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు ఇచ్చినప్పటికీ "తరచుగా పెద్దగా రాణించడం లేదు" అని తెలిపాడు. అదే సమయంలో రెండు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా రోహిత్ శర్మ ప్రదర్శన కూడా స్ధాయికి తగ్గట్టుగా లేదన్నాడు.

నితీష్ ను ఎలా వాడుకోవాలనే విషయంతో పాటు అతనికి ఇవ్వాల్సిన అవకాశాలపై తాము మాట్లాడుకుంటూనే ఉంటామని రయాన్ టెన్ టస్కటే తెలిపాడు. అయితే అతనికి అవకాశం ఇచ్చినప్పుడు తరచుగా విఫలమవుతున్నాడని తెలిపాడు. న్యూజిలాండ్ స్పిన్నర్లు పరిస్థితులను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నారో చూస్తే, భారత్ ... నితీష్ రెడ్డికి బదులుగా మూడవ స్పిన్నర్‌ను ఆడటానికి ఇష్టపడుతుందని టెన్ డస్కటే అంగీకరించాడు. గతంలో ఆడించిన కాంబినేషన్లను పరిశీలిస్తే, తాము అదనపు స్పిన్నర్ వైపే మొగ్గుచూపుతామన్నాడు. వాషింగ్టన్ సుందర్ గైర్హాజరీలో ఆయుష్ బదోనీని తీసుకోవాలనుకున్నా.. రాజ్ కోట్ పిచ్ కు నితీష్ సరిపోతాడనే తీసుకున్నట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications