మరో పతకానికి చేరువగా మను భాకర్
Manu Bhaker and Sarobji Singh: బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్.. ఒలింపిక్స్ 2024 రసవత్తరంగా కొనసాగుతోంది. పతకాల పట్టికలో భారత్ బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్ కేటగిరీలో భారత షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
ఇప్పుడు ఆమె ఖాతాలో మరో పతకం కూడా ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ కేటగిరీలో మూడో స్థానానికి అర్హత సాధించారామె. తోటి షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ విభాగంలో కాంస్య పతకం కోసం పోటీ పడనున్నారు. ఇందులో గెలిస్తే మను భాకర్- సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని ముద్దాడతారు.

మూడో స్థానంలో కాంస్య పతకం కోసం దక్షిణ కొరియాకు చెందిన లీ వొన్-హో, యె-జిన్ జోడీతో మను భాకర్- సరబ్జోత్ సింగ్ పోటీ పడాల్సి ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ రౌండ్ షెడ్యూల్ అయింది. ఇదే కేటగిరీలో పోటీ పడ్డ భారత షూటర్లు అర్జున్ సింగ్ చీమా- రిథమ్ సంగ్వాన్ జోడీ 10వ స్థానంతో సరిపెట్టుకుంది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్ విమెన్స్ ఫైనల్స్‌లో రమిత జిందాల్ నిరాశపరిచారు. ఆమె ఏడో స్థానంలో నిలిచారు. మొత్తం 145.3 పాయింట్లను సాధించగలిగారు. ఈ కేటగిరిలో దక్షిణ కొరియాకు చెందిన హెచ్ జే బాన్- 251.8, చైనాకు చెందిన వైటీ హ్యుయాంగ్- 251.8, స్విట్జర్లాండ్ షూటర్ గొంగ్నియాట్- 230.3.. తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి పతకాలు ఖాయం అయ్యాయి.
అమెరికాకు చెందిన ఎస్ మద్దలెనా- 186.1. ఫ్రాన్స్ షూటర్ ముల్లర్- 165.4తో ఆ తరువాతి స్థానాలను ఆక్రమించారు. రమిత జిందాల్ ఏడో స్థానానికి పరిమితం అయ్యారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏకంగా 631 పాయింట్లను కొల్లగొట్టి ఫైనల్స్‌కు అర్హత సాధించారు రమిత జిందాల్. దీనితో ఆమెపై ఎన్నో ఆశలు ఏర్పడినప్పటికీ.. అవి వాస్తవ రూపం దాల్చలేకపోయాయి. పతకం ఖాయం చేసే ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications