చరిత్ర సృష్టించిన మను భాకర్- ఒకే ఒలింపిక్స్‌లో రెండో పతకం

Manu Bhaker and Sarobji Singh: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో పతకం పడింది. పతకాల పట్టికలో తన సంఖ్యను రెండుకు పెంచుకోగలిగవింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్ కేటగిరీలో భారత షూటర్ మనూ భాకర్- సరబ్జొత్ సింగ్ జోడీ.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో మను భాకర్ సాధించిన రెండో కాంస్య పతకం ఇది. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విమెన్స్ కేటగిరీలో ఆహె కాంస్య పతకాన్ని ముద్దాడిన విషయం తెలిసిందే. 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో పతకం పడింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్ కేటగిరీలో సరబ్జొత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని అందుకున్నారు.

Manu Bhaker and Sarabjot Singh winning Bronze in ongoing Paris Olympics 2024

మూడో స్థానంలో కాంస్య పతకం కోసం దక్షిణ కొరియాకు చెందిన లీ వొన్-హో, యె-జిన్ జోడీతో మను భాకర్- సరబ్జోత్ సింగ్ పోటీ పడ్డారు. 13 రౌండ్ల పాటు ఈ గేమ్ కొనసాగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా నిలిచింది. 2, 3, 4, 5, 7, 9, 10 రౌండ్లల్లో మను భాకర్- సరబ్జొత్ సింగ్ జోడీ 20కి పైగా పాయింట్లను సాధించారు. అదే వారికి విజయాన్ని దక్కేలా చేసింది.

దక్షిణ కొరియాకు చెందిన లీ వొన్-హో, యె-జిన్ జోడీ 1, 6, 8, 11, 12 రౌండ్లల్లో 20కి పైగా పాయింట్లను కొట్టగలిగారు. చివరి రౌండ్ ముగిసేసరికి 16-10 స్కోర్ తేడాతో భారత్.. ఈ గేమ్‌ను గెలిచింది. మూడో స్థానంలో నిలవగలిగింది. కాంస్య పతాకాన్ని అందుకుంది.

భారత్.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను అందుకోవడం ఇదే తొలిసారి. ఆ ఘనతను మను భాకర్ సాధించారు. గతంలో పీవీ సింధు రెండుసార్లు పతకం సాధించారు గానీ అవి వేర్వేరు ఒలింపిక్స్ గేమ్స్. ఒకే టోర్నమెంట్‌లో రెండు పతకాలను అందుకున్నది మాత్రం మను భాకరే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రెండో కాంస్యం అందడం పట్ల భారత్‌లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి మన్‌ సుఖ్ భాయ్ మాండవీయ, వివిధ కేంద్రమంత్రులు ఆమెకు శుభాకాంక్షలను తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+