ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న మహ్మద్ షమీ
Mohammed Shami: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా ఆడిన ప్లేయర్.. మహ్మద్ షమీ. ఈ టోర్నమెంట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్.. తాజాగా ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మొత్తం మీద ఏడు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు నేలకూల్చాడు. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్లను పడగొట్టి తన సత్తా చాటాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లల్లోనూ నాలుగుకు తక్కువ కాకుండా వికెట్లను పడగొట్టాడు.

వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లను పడగొట్టిన ప్లేయర్‌ల సరసన నిలిచాడు. అతని కంటే ముందు గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, మిఛెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, వసీం అక్రమ్, లసిత్ మలింగ.. మాత్రమే ఈ రికార్డును నెలకొల్పారు. మహ్మద్ షమీ ఇప్పుడు మరో ఘనతను సాధించాడు.
క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారాన్ని సాధించాడు. దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు. క్రీడారంగంలో వివిధ కేటగిరీల్లో ఎంపికైన ఆటగాళ్లకు ద్రౌపది ముర్ము అర్జున అవార్డును ప్రదానం చేశారు.
కాగా- గాయం వల్ల మహ్మద్ షమీ మరికొంతకాలం పాటు క్రికెట్ దూరమైన విషయం తెలిసిందే. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ముగిసిన తరువాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. మడమ గాయం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కూ అందుబాటులో ఉండట్లేదు. తొలి రెండు టెస్టుల్లో అతను ఆడట్లేదు.












Click it and Unblock the Notifications