రోహిత్ శర్మకు బిగ్ షాక్..ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్..?
భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ ఒక అమూల్యమైన ఆస్తి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రోహిత్ శర్మ, భారతీయ క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును అనేక విజయాలకు నడిపించాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అనేక ఐపీఎల్ టైటిల్స్‌ను అందించాడు.ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాడు.అయితే టెస్ట్ క్రికెట్‌పై మాత్రం రోహిత్ శర్మ తన ముద్ర వేయలేకపోయాడు. ఆస్ట్రేలియా జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిాత్ శర్మ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో అతను రిటైర్మెంట్‌పై విపరీతమైన ప్రచారం జరిగింది.

రంజీలు ఆడినప్పటికీ ఫలితం లేకపోయింది.తక్కువ పరుగులకే రోహిత్ పెవిలియన్ చేరాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ ఫెయిల్ అయ్యాడు.దీంతో అతని కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇటువంటి సమయంలోనే రోహిత్‌కు కోచ్ గంభీర్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ సాగుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈక్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని గంభీర్ భావిస్తున్నారు.ఒకవేళ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటే, హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.సెలక్షన్ కమిటీ సభ్యులు ఇప్పటికే పాండ్యాతో చర్చించినట్టు తెలుస్తోంది. పాండ్యా నాయకత్వంలో టీమిండియా ఇప్పటికే చాలా మ్యాచులు ఆడింది.దీంతో బీసీసీఐ పాండ్యా వైపు మొగ్గు చూపిస్తోంది. జట్టు కొత్త కెప్టెన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications