IPL 2025: ఐపీఎల్ జట్లకు కొత్త కెప్టెన్లు- కోహ్లీ, ఎస్కేవైకి తప్పని బాధ్యత..!!
IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో సంచనాలు నమోదు అవుతున్నాయి. రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ గా నిలిచారు. అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యార్ రికార్డు ధర పలికారు. తాజా వేలంతో ఒక్క సారిగా జట్ల అంచనాలు మారిపోయాయి. పలు జట్లకు కెప్టెన్లు మారారు. కొత్త కెప్టెన్లు వచ్చేసారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కు ఈ సారి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తప్పేలా లేవు. దీంతో, ఐపీఎల్ మరింత ఉత్కంఠ పెంచేలా ప్రస్తుత ఆక్షన్ .. కొత్త లెక్కలు మొదలయ్యాయి.
సూర్య పైనే గురి
తాజా ఆక్షన్ తో పలు జట్లకు కెప్టెన్లు మారిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం కెప్టెన్ మారే అవకాశం కనిపించటం లేదు. గత సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించారు. తిరిగి రానున్న సీజన్ కు కొనసాగే అవకాశం ఉంది. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఆసీస్ ప్లేయర్ కమ్మిన్స్ పైనల్ వరకు తీసుకెళ్లాడు. తిరిగి ఈ సారి అతడిని రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ కమ్మిన్స్ నే కొనసాగించనుంది. ఇక..ముంబాయి ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.

అటు పంత్.. ఇటు రాహుల్
గుజరాత్ టైటాన్స్ కు ఇప్పటి వరకు గిల్ కొనసాగుతున్నాడు. ఈ సారి కూడా గిల్ పైనే భారం వేసే అవకాశం ఉంది. వచ్చే సీజన్ లోనూ గిల్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. రాజస్థానం రాయల్స్ ను గత సీజన్ లో సంజు శాంసన్ నడిపించాడు. ఈ జట్టులో సంచలన ఆటగాళ్లను టీం రిటైన్ చేసుకుంది. దీంతో, సంజు కెప్టెన్ గా కొనసాగటం ఖాయమే. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ గా వేలం లో కొత్త రికార్డులు లిఖించిన రిషబ్ పంత్ ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ప్రస్తుత వేలంలో రూ 26.75 కోట్లకు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ కు బాధ్యతలు ఇవ్వనున్నారు.
కోహ్లీకి ఆర్సీబీ బాధ్యతలు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ 14 కోట్లకు రాహుల్ ను సొంతం చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ను గత సీజన్ లో విజేతగా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు లేకపోవటంతో వెంకటేష్ అయ్యర్ కు కెప్టెన్ గా ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ టీం లో నరైన్, రసెల్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక,
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను ఈ సారి టీం మేనేజ్ మెంట్ వద్దనుకుంది. దీంతో, తిరిగి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత వేలం పూర్తయిన తరువాత కెప్టెన్సీ పన స్పష్టత రానుంది
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications