కప్ కొట్టాలంటే 252 కొట్టాల్సిందే..ఇక అంతా మీ చేతుల్లోనే
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా,న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీమిండియా ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు శుభారంభం దక్కింది. వికెట్ నష్టపోకుండ ఆ జట్టు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఓపెనర్ రచిన్ రవీంద్ర వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ఈ భాగస్వామ్యాన్ని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. మరో ఓపెనర్ విల్ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ రచిన్ రవీంద్రను తన స్పిన్‌తో బోల్తా కొట్టించాడు.కేన్ విలియమ్సన్ సైతం క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.విలియమ్సన్ కుల్దీప్‌కు రిటన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.ఆ వెంటనే టామ్ లాథమ్‌ను జడేజా అవుట్ చేశాడు.

63 పరుగులు చేసిన డారిల్ మిచెల్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లలో మైఖేల్ బ్రేస్‌వెల్ బ్యాట్ ఝుళిపించడంతో న్యూజిల్యాండ్ 250 మార్క్ అందుకుంది. దీంతో టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది.టీమిండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చేరో రెండు వికెట్లు తీయగా షమీ, జడేజా తలో వికెట్ తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలవాలంటే టీమిండియా 252 పరుగులు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications