Ind vs Pak: రోహిత్-గిల్ అర్ధసెంచరీలు- తేలిపోయిన పాక్ బౌలర్లు..దూసుకుపోతున్న భారత్
శ్రీలంకలోని కొలంబోలో పాకిస్తాన్ తో జరుగుతున్న ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ లో భారత్ శుభారంభం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ శుభారంభం అందించారు. గిల్ ఆరంభం నుంచీ పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రోహిత్ మాత్రం ఆరంభంలో నెమ్మదిగా ఆడినా క్రమంగా దూకుడు పెంచాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో భారత్ కూడా తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం అందుకుంది.

ఆరంభం నుంచీ పాకిస్తాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో గిల్ కు ఇది ఎనిమిదో అర్ధ సెంచరీ. ఆ వెంటనే పాక్ స్పిన్నర్ షాదాబ్ పై సిక్సర్లతో విరుచుకుపడిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ 42 బంతుల్లో 4 సిక్స్ లు, 6 ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత్ కూడా తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం దాటిపోయింది.
అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ దూకుడు కొనసాగుతోంది. పాకిస్తాన్ బౌలర్లలో గత మ్యాచ్ ల్లో ఫర్వాలేదనిపించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షహీన్ అఫ్రిదితో పాటు నసీమ్ షా, కొత్త బౌలర్ ఫహీమ్ కూడా తేలిపోయాడు.
అయితే భారత్ దూకుడుగా ఆడుతున్న సమయంలో స్పిన్నర్ షాదాబ్ 56 పరుగులు చేసిన రోహిత్ శర్మను అవుట్ చేశాడు. దీంతో భారత్ 16.4 ఓవర్ల వద్ద భారత్ తొలివికెట్ కోల్పోయింది.
అనంతరం మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ ను రెండో స్పెల్ లో బౌలింగ్ కు దిగిన పేసర్ షహీన్ అఫ్రిది వెనక్కి పంపాడు. 58 పరుగులు చేసిన గిల్.. అఫ్రిది బౌలింగ్ లో షాదాబ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ 123 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం విరాట్ కొహ్లీ... కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ప్రేమదాస స్టేడియంలో భారత్ 300కు పైగా పరుగులు చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి.
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications