Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. పెరిగిన సస్పెన్స్!

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందా.. లేదా.. అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం జరగాల్సిన పాకిస్థాన్ జాతీయ జట్టు 'వరల్డ్ కప్ కిట్' ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆకస్మికంగా రద్దు చేసింది. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు బోర్డు ప్రకటించినప్పటికీ.. దీని వెనుక పెద్ద దౌత్యపరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు కారణం ఏంటి?
పాకిస్థాన్ విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక అనుమతి లభించకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ టోర్నీలో పాక్ పాల్గొనాలా వద్దా అనే అంశంపై సోమవారం విదేశాంగ శాఖ తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది. అప్పటి వరకు కిట్ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహించి టోర్నీలో పాల్గొంటున్నట్లు సంకేతాలు ఇవ్వడానికి పీసీబీ సుముఖంగా లేదు.

Pakistan T20 World Cup 2026 Participation Suspense PCB Cancels Kit Launch Amid Diplomacy

శ్రీలంకలోనే పాక్ మ్యాచ్‌లు!
పాకిస్థాన్ జట్టు తన ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. భారత్‌తో జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ (ఫిబ్రవరి 15)తో పాటు ఒకవేళ ఫైనల్‌కు చేరినా ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది. ఐసీసీ, పీసీబీ, బీసీసీఐ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం 2027 వరకు భారత్-పాక్ మ్యాచ్‌లు కేవలం తటస్థ వేదికలపైనే జరగనున్నాయి.

బాయ్‌కాట్ చేసే అవకాశం ఉందా?
కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ జట్టు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయాన్నే కొలంబోకు బయలుదేరడానికి ఇప్పటికే ట్రావెల్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంది. కాబట్టి టోర్నీని బహిష్కరించే అవకాశాలు దాదాపు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీలో తన స్థానాన్ని దెబ్బతీసుకోకూడదని పీసీబీ భావిస్తోంది. అయితే సోమవారం విదేశాంగ శాఖ ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసమే ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+