World Cup Winner: వరల్డ్ కప్ విజేత వారే ? జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ జోస్యం..!
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (icc world cup) ఫైనల్ దశకు చేరింది. ఇప్పటికే రెండు సెమీ ఫైనళ్లలో విజేతలుగా నిలిచిన ఇండియా (INDIA), ఆస్ట్రేలియా (AUSTRALIA) జట్లు ఫైనల్ కు దూసుకెళ్లాయి. ఇక మిగిలింది ఆదివారం జరిగే ఫైనల్ మాత్రమే. ఈ అంతిమ పోరులో విజేతగా నిలిచే వాళ్లదే ఐసీసీ వరల్డ్ కప్. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే తుది పోరు కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ టైటిల్ అందుకునే విజేత ఎవరనేది చెప్పేందుకు ఈసారి ఎవరూ సాహసించడం లేదు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ పోరు భీకరంగా సాగబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో భారతే క్లియర్ ఫేవరెట్ గా కనిపిస్తున్నా ఫైనల్ పోరును ఆస్ట్రేలియా కూడా అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదని అర్ధమవుతోంది. దీంతో భారత్-ఆస్ట్రేలియా పోరులో క్లియర్ విజేత ఎవరన్నది చెప్పేందుకు మాజీ క్రికెటర్లు కానీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా అంత తేలిగ్గా చెప్పలేని పరిస్ధితి.

ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ విజేత ఎవరో తన అంచనాను వెల్లడించారు. అయితే ఆయన ఇరుజట్ల బలాబలాల్ని, టోర్నీలో ఆధిపత్యం, విజయాల బట్టి కాకుండా ఇరుజట్ల జాతకాలను బట్టి జోస్యం చెప్పారు. తాను రెండు వైపుల జాతకాలను పోల్చి చూస్తే, ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయి అవుతుందని ఆయన తేల్చిచెప్పేశారు. ఆస్ట్రేలియా జట్టు జాతకంతో పోలిస్తే టీమిండియా జాతకం ఎంతో మెరుగ్గా ఉందన్నారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత్ కు అన్ని విధాలుగా అవకాశం ఉందని పండిట్ జగన్నాథ్ గురూజీ తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతకం కంటే భారతదేశం యొక్క జాతకం చాలా మెరుగ్గా మరియు బలంగా ఉందని ఆయన తెలిపారు. భారత ఆటగాళ్లలో ప్రస్తుతం ఉన్న ఉత్సాహం, శక్తి, చిత్తశుద్ధి, అంకితభావం ఆస్ట్రేలియాను ఓడించేందుకు వారికి అవసరమైన బలాన్ని అందిస్తుందని జగన్నాథ్ అంచనా వేశారు.












Click it and Unblock the Notifications