PM Modi Wishes Virat Kohli: కింగ్ కొహ్లీకి మోడీ కంగ్రాట్స్-ఎమోషనల్ మెసేజ్..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో న్యూజీలాండ్ పై అద్భుత సెంచరీతో సచిన్ 49 సెంచరీల రికార్డును అధిగమించి 50వ సెంచరీ చేసిన కింగ్ విరాట్ కొహ్లీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కొహ్లీ 50 సెంచరీల వరల్డ్ రికార్డుపై పలువువు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు, ఫ్యాన్స్, రాజకీయ నేతలు కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ కూడా విరాట్ కొహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

కివీస్ పై అద్భుత సెంచరీతో వన్డే క్రికెట్లో 50 సెంచరీల మార్క్ అందుకున్న విరాట్ కొహ్లీని ప్రశంసిస్తూ ఎక్స్ లో ప్రధాని మోడీ సందేశం పంపారు. ఇదులో ప్రధాని మోడీ.. అతను(విరాట్ కొహ్లీ) కేవలం తన 50వ వన్డే సెంచరీని సాధించడమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్ఠత, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడని కొనియాడారు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమన్నారు.

pm modi congratulates virat kohli on 50 tons record, wishes to set benchmark for future generations

అలాగే తాను విరాట్ కొహ్లీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాననని మోడీ తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆయన ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పుతూనే ఉంటాడని మోడీ ఆకాంక్షించారు. తద్వారా విరాట్ కొహ్లీ సాధించిన ఘనత దేశంలోని ప్రజలతో పాటు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయయం కావాలని ప్రధాని మోడీ కోరుకున్నట్లయింది. ప్రధాని మోడీతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా విరాట్ కొహ్లీ వరల్డ్ రికార్డు ఫీట్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

ఇవాళ కివీస్ తో సెమీ ఫైనల్లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన విరాట్ కొహ్లీ... 113 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. విరాట్ సెంచరీతో పాటు మరో బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ నమోదు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా ప్రత్యర్ధి న్యూజీలాండ్ కు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+