Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024: ఈసారి టీ20 వరల్డ్ కప్ వారిదే-షోయబ్ అక్తర్ జోస్యం..!

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ దశలో ఉంది. ఇవాళ ఉదయం జరిగిన తొలి సెమీ పైనల్లో అజేయ దక్షిణాఫ్రికా జట్టు ఆసియా సంచలనం ఆప్ఘనిస్తాన్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో చోటు ఖరారు చేసుకుంది. సాయంత్రం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచే జట్టుతో దక్షిణాఫ్రికా ఫైనల్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ విజేతపై ఉత్కంఠ పెరుగుతోంది.

ఈసారి టీ 20 వరల్డ్ కప్ సెమీస్ కు చేరిన నాలుగు జట్లలో ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ నిష్కృమించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లండ్ జట్లకు విజేతగా నిలిచే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఈ మూడు జట్లలో ఒకరు టైటిల్ గెలవడం ఖాయమే. దీంతో వీరిలో టైటిల్ ఎగరేసుకుపోయేది ఎవరన్న దానిపై అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరున్న పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన అంచనాను వెల్లడించాడు.

Rawalpindi Express Shoaib Akhtar s prediction on T20 World Cup 2024 Winner

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ20 వరల్డ్ కప్ విజేతపై షోయబ్ అక్తర్ తన జోస్యం వెల్లడించాడు. ఈసారి పొట్టి వరల్డ్ కప్ గెలిచే అవకాశం టీమిండియాకే ఉందని అక్తర్ తేల్చేశాడు. "వెల్ డన్ ఇండియా, ఇది ఇప్పుడు మీ ప్రపంచ కప్. మీరు దీన్ని గెలవాలి మరియు ప్రపంచ కప్ ఉపఖండంలో నిలవాలి. మీరు దీనికి వంద శాతం అర్హులు. నా మద్దతు మీకు ఉంటుంది." అని అక్తర్ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో దారుణ ఓటమి తరువాత భారత జట్టు ప్రస్తుత ఫామ్ ప్రతీకార స్ధాయిలో ఉందని అక్తర్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్ల డిప్రెషన్ కాస్తా అబ్సెషన్ గా మారిందన్నాడు.
నిరాశ నుండి నిర్ణయానికి వచ్చిన ఈ మానసిక మార్పు భారత జట్టును ప్రస్తుత టోర్నమెంట్‌లో బలీయమైన శక్తిగా మార్చిందని అక్తర్ విశ్లేషిస్తున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+