యష్ దయాళ్ కు ఉద్వాసన పలికిన ఆర్సీబీ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ పై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. అతను ఇంకా జట్టుతో చేరలేదు. అందుబాటులో లేడు. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్స్ లో కూడా పాల్గొనలేదు. గత ఏడాది ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడైన దయాళ్.. ప్రస్తుతం అనేక వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ క్రికెటర్‌.. వేర్వేరు రాష్ట్రాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

RCB Bus Mystery Deepens as Yash Dayal Face Is Omitted from New Team Vehicle as Misses Training

ఐపీఎల్ కోసం రూపొందించిన ఆర్‌సీబీ టీమ్ బస్సు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దయాల్ మినహా దాదాపు అందరు ఆటగాళ్ల ఫొటోలు ఈ బస్సుపై ముద్రించి ఉన్నాయి. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని జట్టు నుండి ఉద్వాసన పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో ప్రాక్టీస్ సెషన్ కు అతను దూరం కావడంతో ఈ ఊహాగానాలు చెలరేగాయి.

అతనిపై ఉన్న చట్టపరమైన సమస్యల కారణంగా ఫ్రాంఛైజీ అతన్ని జట్టు నుండి తొలగించిందని అభిమానులు చెబుతున్నారు. ఆర్‌సీబీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతను ఎదుర్కొంటోన్న ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ఒక కేసులో అతని ముందస్తు బెయిల్‌ను దిగువ కోర్టు తిరస్కరించినప్పటికీ, రాజస్థాన్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయ ప్రక్రియలో ఉంది.

మీడియా నివేదికల ప్రకారం, దయాల్ గత నెలలో కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండిర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ప్రైవేట్ వివాహ వేడుక ఫిబ్రవరి 4న జరిగింది. కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ జంట తమ వివాహం గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, శ్వేతా పుండిర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యశ్ దయాల్‌తో గడిపిన కొన్ని క్షణాలతో కూడిన ఒక చిన్న వీడియో రీల్‌ను పంచుకున్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+