IPL Auction 2025: అత్యధిక మొత్తంతో వేలంలో పాల్గొననున్న ఆర్సీబీ..
కాసేపట్లో ఐపీఎల్ వేలం 2025 రెండో రోజు ప్రారంభం కానుంది సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వేలం రాత్రి వరకు కొనసాగింది. ఈ రోజుకు కూడా అదే సమయానికి వేలం ప్రారంభం కానుంది. మొదటి రోజు వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆర్సీబీ ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ల కోసం అత్యధిక మొత్తాన్ని వెచ్చించింది.
లియామ్ లివింగ్‌స్టోన్ మి (రూ. 8.75 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), జితేష్ శర్మ (రూ. 11 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ. 12.50 కోట్లు), రసిఖ్ దార్ (రూ. 6 కోట్లు), సుయాష్ శర్మ (రూ. 2.60 కోట్లు) కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్ రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ రిటైన్ ఆటగాళ్ల కోసం విరాట్ కోహ్లీ రూ.21 కోట్లు, రజత్ పాటిదార్ రూ.11 కోట్లు, యస్ దయాల్ రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం రూ.37 కోట్లతో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది.

ఆదివారం వేలంలో రూ.52.35 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు మొత్తం రూ.89.35 కోట్లు ఖర్చు అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.30.65 ఉన్నాయి. ఆర్సీబీ రెండో రోజు భారీ మొత్తంతో వేలంలో పాల్గొననుంది. ప్రస్తుతం ఆర్సీబీ వద్ద తొమ్మిది మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ రోజు వేలంలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోటీ పడనున్నాయి. వీరి వద్దే ఎక్కువ డబ్బు ఉంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. కనిష్ఠంగా 21 మంది ఆటగాళ్లు ఉండేందుకు అవకాశం ఉంది.
ఆర్సీబీ గరిష్ఠంగా 16 మంది ఆటగాళ్లను.. కనిష్ఠంగా 12 ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 మంది స్వదేశీ ఆటగాళ్లు, ఐదుగురు విదేశీ ఆటగాళ్లను కొనగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications