రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తేల్చేసిన బీసీసీఐ- వన్డేల్లో స్ధానంపై క్లారిటీ..!

టీమిండియా వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ పై భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత ఇంగ్లండ్ సిరీస్ ముగియగానే రోహిత్ శర్మను రిటైర్మెంట్ తీసుకోమని సూచించిన బీసీసీఐ.. లార్డ్స్ లో జరిగిన చివరి వన్డేనే తనకు ఆఖరుదని చెప్పేసింది. అయితే అనూహ్యంగా అదే లార్డ్స్ వన్డేలో హిట్ మ్యాన్ ఏకంగా 138 పరుగులు చేసి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. దీంతో బీసీసీఐ ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక భేటీ నిర్వహించిన బీసీసీఐ... రోహిత్ శర్మ స్ధానంపై క్లారిటీ ఇచ్చేసింది.

రిటైర్మెంట్ తీసుకోమన్న సెలెక్టర్..! ఆగ్రహంతో ఊగిపోయిన రోహిత్ శర్మ..!
రిటైర్మెంట్ తీసుకోమన్న సెలెక్టర్..! ఆగ్రహంతో ఊగిపోయిన రోహిత్ శర్మ..!

రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారంపై ఇవాళ బీసీసీఐ భేటీ తర్వాత కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు ఆజ్యం పోయవద్దని కోరారు. భారత మాజీ కెప్టెన్ అద్భుతంగా ఆడుతున్నాడని, వన్డే జట్టులో అతని స్థానానికి తక్షణ ముప్పు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.రోహిత్ అన్ని మ్యాచ్‌లలోనూ అద్భుతంగా ఆడుతున్నాడని, అతను ఆడిన చివరి మ్యాచ్‌లో 130 పరుగులు చేశాడని గుర్తుచేశారాు. మీకు ఇంకా ఏమి కావాలి? ఈ ఊహాగానాలు ఎందుకని మీడియాను ప్రశ్నించారు. తాను ఈ ఊహాగానాలకు ఆజ్యం పోయదలుచుకోలేదన్నారు.

Rohit Sharma Faces No Immediate Threat to ODI Spot Says BCCI Secretary Devajit Saikia
India vs Sri Lanka: శ్రీలంక పోరుకు హ్యాట్సాఫ్..! భారత్ గెలవాల్సిన మ్యాచ్ డ్రా..!
India vs Sri Lanka: శ్రీలంక పోరుకు హ్యాట్సాఫ్..! భారత్ గెలవాల్సిన మ్యాచ్ డ్రా..!

ఇవాళ జరిగిన బీసీసీఐ భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి సైకియా హాజరయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పదవీకాలం ముగియనున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇవాళ జరిగిన భేటీలో తాము ప్రధానంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లో జట్టు ప్రదర్శన ఎలా ఉంది, అలాగే వచ్చే ఏడాది ఏం చేయబోతున్నాం అనే విషయాలపై చర్చించామని దేవజిత్ సైకియా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+