రిటైర్మెంట్ తీసుకోమన్న సెలెక్టర్..! ఆగ్రహంతో ఊగిపోయిన రోహిత్ శర్మ..!
టీమిండియాకు గతంలో టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా.. మూడు ఫార్మాట్లలోనూ ఎన్నో విజయాలు అందించిన చరిత్ర ఉన్న డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2027 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మను ఆడిస్తారా లేదా అన్నది తేలడం లేదు. ఇవాళ బీసీసీఐ నిర్వహిస్తున్న కీలక భేటీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా భవితవ్యాల్ని కూడా బోర్డు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి ఓ కీలక వార్త బయటికి వచ్చింది.
ఇప్పటికే టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పేసిన రోహిత్ శర్మ.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇదే క్రమంలో గతంలో జరిగిన ఇంగ్లండ్ టూర్ లో వన్డే సిరీస్ ఆడిన రోహిత్ శర్మ.. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. అదే సమయంలో రోహిత్ శర్మను ఇక తప్పుకోవాలని కోరాలని బీసీసీఐ నిర్ణయించింది. అదే విషయాన్ని సెలెక్షన్ కమిటీలోని సభ్యుడొకరు రోహిత్ కు నేరుగా వెళ్లి చెప్పారు. ప్రస్తుత పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని సదరు సెలెక్టర్ హిట్ మ్యాన్ కు సూచించారు. దీంతో రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇకపై తదుపరి దశకు వెళ్లాలని అంటే కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిందని సదరు సెలెక్టర్ రోహిత్ కు చెప్పారు. కాబట్టి ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత తన కెరీర్‌కు ముగింపు పలుకుతారా అని రోహిత్‌ను అడిగారు. దీంతో రోహిత్ ఆగ్రహానికి గురైనప్పటికీ.. చివరికి అంగీకరించారనే వార్తలు వినిపించాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే అదే లార్డ్స్ వన్డేలో 138 పరుగులతో దుమ్మురేపిన రోహిత్ రిటైర్మెంట్ తీసుకోలేదు, సెలెక్టర్లు కూడా ఆ తర్వాత శాంతించారు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మాత్రం రోహిత్ శర్మ జట్టుకు ఎంతో విలువైన ఆస్తి అని.. అతన్ని వరల్డ్ కప్ కు కొనసాగించాలని సూచిస్తున్నాడు.














Click it and Unblock the Notifications