IPL 2024: స్టాండ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉన్న బౌలర్ తక్కువ సిక్స్ లు కొట్టమంటే? రోహిత్ తెలివైన జవాబు..
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తనను తప్పించిన తర్వాత అభిమానుల అభిమానం రెట్టింపు చేసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు తాజాగా ఓ హిందీ టీవీ షోలో పాల్గొన్నాడు. ఇందులో వ్యాఖ్యాత అడిగిన ఓ స్మార్ట్ ప్రశ్నకు రోహిత్ శర్మ అంతే స్మార్ట్ గా బదులిచ్చాడు. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ ఇచ్చిన ఆ జవాబు చర్చనీయాంశమవుతోంది.
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టాండ్స్ లో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొచ్చిన బౌలర్.. తన బౌలింగ్ లో తక్కువ సిక్సర్లు కొట్టమని మిమ్మల్ని బతిమాలుకుంటే ఏం చేస్తారంటూ ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో వ్యాఖ్యాత కపిల్ శర్మ రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రోహిత్ శర్మ అలాంటి పరిస్ధితే వస్తే తనకు మరో సమస్య ఎదురవుతుందని చెప్పాడు. అదే స్టాండ్ లో తన ఆట చూసేందుకు భార్య రితిక కూడా వస్తుందని, తాను అలా తక్కువ సిక్స్ లు కొడితే తను మరింత టెన్షన్ పడుతుందన్నాడు. కాబట్టి తన భార్యే తనకు ముఖ్యమని రోహిత్ చెప్పేశాడు.

అదే షోలో పాల్గొన్న రితికను కూడా కపిల్ శర్మ మరో ప్రశ్న అడిగారు. రోహిత్ ను క్రికెటర్ గా హ్యాండిల్ చేయడం సులువా భర్తగా హ్యాండిల్ చేయడం సులువా అని ప్రశ్నించారు. దీనికి ఆమ కొద్దిసేపు ఆలోచించి, "భర్త." అని చెప్పింది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు తనతో పాటు ఉంటే వారు తమ కెప్టెన్ గా రోహిత్ ను మేనేజ్ చేయగలరని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె క్రికెట్ మైదానానికి రాలేదని, డ్రెస్సింగ్ రూమ్‌కి కూడా రాలేదని, కానీ తాను ఇంట్లోకి వెళ్లాలని, అక్కడ ఆమె కెప్టెన్ అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు.












Click it and Unblock the Notifications