నెల క్రితమే విడాకులు.. గుడ్ న్యూస్ చెప్పిన సైనా నెహ్వాల్..!
బ్యాడ్మింటన్ కపుల్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ కొన్ని వారాల క్రితం డైవర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వాళ్లు నిర్ణయం మార్చకున్నట్లు తెలుస్తోంది. తిరగి తాము ఒకటయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సైనా తెలిపారు. ఈ మేరకు కశ్యప్ తో దిగిన ఫొటోతో తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు.
All the best...it takes guts to be public about it when you know it can fail again#saina_nehwal pic.twitter.com/VNHXmIhbQ3
— kesari🕉🚩 (@UnapologeticH_1) August 2, 2025
దూరంగా ఉన్నప్పుడే సన్నిహితుల బంధాలు తెలుస్తాయని అనే భావంతో ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్టుకు రెండు హార్ట్ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సైనా- కశ్యప్ ల నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట 2018 లో ఒక్కటయ్యారు. వీరిద్దరూ హైదరాబాద్ లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు. అక్కడ ఇద్దరూ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. అప్పుడే వీరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరూ అనేక టోర్నీలు ఆడారు.

అలా 2018లో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త పారుపల్లి కశ్యప్ తో తాను విడిపోతున్నట్లు జులై 13న ఇన్ స్టా స్టోరీ ద్వారా సైనా నెహ్వాల్ ప్రకటించారు. చివరిసారిగా 2023 జూన్ లో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో సైనా ఆడారు. మరోవైపు కశ్యప్ కాంపిటీటివ్ బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో సైనా గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications