పాకిస్తాన్ టీమ్ లో ఆ దుష్ట గ్రహాలు- వాళ్లు పోతే గానీ..!!
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసింది.. భారత్. 61 పరుగుల తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో 175 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచీ వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. 114 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో భారత్.. సూపర్ 8 దశకు దూసుకెళ్లింది.
ఈ ఓటమి పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర అలజడి సృష్టించింది. పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తోన్నారు. పీసీబీ పనితీరు, జాతీయ జట్టు నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ముఖ్యంగా భారత్ వంటి అగ్రశ్రేణి జట్లు, మ్యాచ్ లో కీలక సమయాల్లో రాణించని సీనియర్ ఆటగాళ్లను పీసీబీ సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు పేలవ ప్రదర్శనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.

మోహసిన్ నఖ్వీ సమర్థతను ప్రశ్నించాడు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్. ఆయన పేరును ప్రస్తావించకుండా చురకలు అంటించాడు. ఓ వ్యక్తికి తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌నని కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశాడు. జట్టులో ఒకరిద్దరి మీదే డిపెండ్ కావాల్సిన దుస్థితిని పీసీబీ కల్పించిందని మండిపడ్డాడు. జట్లులో ఒక్కడినే సూపర్‌స్టార్‌గా భావిస్తోన్నాడని, అతనేమో కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేడని వ్యాఖ్యానించాడు. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్టార్‌గా అతన్ని తయారు చేశారని విమర్శించాడు.
ఇప్పుడు తాజాగా మాజీ కేప్టెన్ షాహిద్ అఫ్రిది సైతం ధ్వజమెత్తాడు. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిది సహా సీనియర్ ఆటగాళ్ళపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. పదే పదే విఫలమవుతున్న బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లకు విశ్రాంతినిచ్చి యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పాడు. షాహీన్, షాదాబ్‌ను, బాబర్‌ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని, కీలకమైన పెద్ద మ్యాచ్‌లలో వారు ఎప్పుడూ రాణించట్లేదని మండిపడ్డాడు.
సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నమీబియాపై జరిగే తదుపరి మ్యాచ్ లో ఈ ముగ్గురినీ తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని షాహిన్ షా అఫ్రిది సూచించాడు. కొత్త వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని పేర్కొన్నాడు. సీనియర్లు విఫలమైన ప్రతీసారీ వారిని పక్కన పెట్టి, బెంచ్‌లో ఉన్న జూనియర్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదని చెప్పాడు. భారత్‌తో మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది విఫలం అయ్యాడు. రెండు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు.












Click it and Unblock the Notifications