శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై సూర్య బిగ్ అప్డేట్..! ఫోన్లో మాట్లాడాక క్లారిటీ..!
ఆస్ట్రేలియాతో తాజాగా ముగిసిన వన్డే సిరీస్ లో అనూహ్యంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డా టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మ్యాచ్ లో గాయపడగానే బీసీసీఐ సిబ్బంది గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి శరీరంలో రక్తం గడ్డ కట్టినట్లు నిర్దారించారు. అనంతరం మరింత లోతుగా పరీక్షించి కీలక అవయవాలు కూడా ప్రభావితమైనట్లు తేల్చారు. దీంతో అందరిలోనూ ఒకటే ఆందోళన. శ్రేయస్ తిరిగి వస్తాడా లేదా అని.
ఇలాంటి పరిస్ధితుల మధ్య ఇవాళ శ్రేయస్ అయ్యర్ స్వయంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడాడు. శ్రేయస్ కాస్త కోలుకున్నట్లు తెలియడంతో సూర్యకుమార్ యాదవ్ ఫోన్ చేసి శ్రేయస్ తో మాట్లాడాడు. దీంతో సూర్యకుమార్ కు శ్రేయస్ తన ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని శ్రేయస్ చెప్పినట్లు సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. దీంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది.

తాము శ్రేయస్ తో మాట్లాడామని, అతని గాయం గురించి మాకు తెలియగానే ఫోన్ చేసానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అప్పుడు శ్రేయస్ వద్ద తన ఫోన్ లేదని నేను తెలిసిఫిజియో కమలేష్ జైన్‌కు కాల్ చేసినట్లు సూర్య చెప్పాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పాడన్నాడు. మొదటి రోజు తాను ఎలా ఉన్నాడో తెలియదని, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడన్నాడు. తాము రెండు రోజులుగా శ్రేయస్ కు టచ్‌లో ఉన్నామని తెలిపాడు.

తమ ఫోన్ కాల్స్ కు శ్రేయస్ సమాధానం ఇస్తున్నట్లు సూర్యకుమార్ వెల్లడించాడు. అతను ఫోన్‌లో సమాధానం ఇవ్వగలిగితే, అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లే అని సూర్య తెలిపాడు. అయితే అయ్యర్‌ను మరికొన్ని రోజులు నిశిత పరిశీలనలో ఉంచుతామని డాక్టర్లు చెప్పినట్లు సూర్య వెల్లడించాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందన్నాడు. అంతా సాధారణంగానే ఉందని, కానీ అతన్ని కొన్ని రోజులు పరిశీలనలో ఉంచుతారని తెలిపాడజు. అతను అందరితో మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇది మంచి విషయం అన్నాడు.












Click it and Unblock the Notifications