డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి?: కొత్త తేదీపై క్లారిటీ!
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి గురించి వస్తున్న వదంతులపై స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధాన స్పందించారు. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడంతో వివాహ వేడుకను వాయిదా వేశారు. ఇటీవల ఈ జంట డిసెంబర్ 7న కొత్త తేదీని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వదంతులపై శ్రవణ్ మంధాన స్పష్టత ఇచ్చారు. డిసెంబర్ 7న పెళ్లికి సంబంధించిన ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపారు. "ఈ వదంతుల గురించి నాకు ఏమీ తెలియదు. ప్రస్తుతానికి పెళ్లి వాయిదాలోనే ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

వాయిదా వెనుక అసలు కారణంపై ఊహాగానాలు
నవంబర్ 23న పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి తండ్రి అనారోగ్యం ఒక్కటే కారణం కాదనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. పలాష్ ముచ్చల్ మరొకరితో సన్నిహితంగా ఉన్నాడనే పుకార్లు మొదలయ్యాయి. ఈ వదంతులకు బలం చేకూర్చుతూ స్మృతి మంధాన తన ఎంగేజ్‌మెంట్, వెడ్డింగ్ ఫంక్షన్లకు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. పలాష్ కుటుంబం పెళ్లి జరగాల్సిన సాంగ్లీ నుంచి ముంబైకి తిరిగి వచ్చింది.
ఒత్తిడితో పలాష్ ఆసుపత్రిపాలు
వదంతులు పెరగడంతో పలాష్ ముచ్చల్ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడింది. స్మృతి తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత పలాష్ తీవ్రంగా ప్రభావితం అయ్యాడని, ఒత్తిడి, అలసట కారణంగా అతడిని ముంబైలోని ఆసుపత్రికి మార్చాల్సి వచ్చిందని పలాష్ తల్లి మీడియాకు తెలిపారు. ఈ వివాదంలో వెడ్డింగ్ కొరియోగ్రాఫర్‌లు నందికా ద్వివేది, గుల్నాజ్ ఖాన్ పేర్లు కూడా వచ్చాయి. అయితే తాము ఈ వాయిదాకు కారణం కాదని, తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇరు కుటుంబాలు కొత్త తేదీని ప్రకటించలేదు. ఈ జంట కూడా మౌనంగానే ఉన్నారు.












Click it and Unblock the Notifications