SRH vs RR: వైభవ్ సూర్యవంశీ కట్టడికి మూడు ప్లాన్లు , అదే జరిగితే- కమ్మిన్స్..!!

IPL 2026 SRH Vs RR Eliminator: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు కీలక జట్లు ఎలిమినేటర్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 2 కి అర్హత సాధించి గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. అయితే, ఈ రెండు టీంల్లోనూ ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు ప్రతీ విభాగంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కోసం సన్ రైజర్స్ కెప్టెన్ మూడు ప్రణాళికలతో సిద్దమైనట్లు వెల్లడించారు. అక్కడే మ్యాచ్ ఫలితం ఉందని అంగీకరించారు.

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండు విజయాలు సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఈ కీలక పోరులో నెగ్గి వరుసగా మూడో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే.. ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును హైదరాబాద్ బౌలర్లు అడ్డుకోగలగాలి. ఈ సీజన్‌లో వైభవ్‌పై సన్‌రైజర్స్‌కు మిశ్రమ అనుభవం ఎదురైంది. తొలి మ్యాచ్‌లో అతడిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హైదరాబాద్ బౌలర్లు.. రెండో మ్యాచ్‌లో మాత్రం అతడి విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. ఆ మ్యాచ్‌లో వైభవ్ సెంచరీతో చెలరేగిపోయాడు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం మాత్రం సన్‌రైజర్స్‌కే దక్కింది. వైభవ్‌ను అడ్డుకోవడం కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసినట్లు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసాడు.

 విజయ్ కు వారి మద్దతు విత్ డ్రా, స్పీకర్ కు లేఖ- ఇక నెక్స్ట్..!?
విజయ్ కు వారి మద్దతు విత్ డ్రా, స్పీకర్ కు లేఖ- ఇక నెక్స్ట్..!?
srh-captain-pat-cummins-reveals-special-plans-to-stop-vaibhav-suryavanshi-in-eliminator-match

హోరా హోరీ పోరు పై ఉత్కంఠ

'బౌలర్‌గా మా బలాలేంటి అనేది తెలుసుకోవడం ముఖ్యం. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒక్కడే మలుపు తిప్పగల ప్లేయర్ ఉంటే అతడికి ప్రత్యేక ప్రణాళిక అవసరం. అందుకే వైభవ్ కోసం మూడు ప్రణాళికలు సిద్ధం చేశాం. గత మ్యాచ్‌లో అతడు మా మీద సెంచరీ చేసినా.. కొన్ని దశల్లో మేము అతడిని బాగా కట్టడి చేశాం. కొన్ని సందర్భాల్లో మాత్రం వైభవ్‌ను అడ్డుకోలేకపోయాం. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ప్రతి మ్యాచ్ కొత్తగా మొదలవుతుంది. అయితే గత మ్యాచ్‌ల నుంచి నేర్చుకున్న విషయాలు మాత్రం ఉపయోగపడతాయి. ఆర్ఆర్ ఆటగాళ్లపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. మా ప్లేయర్లు కూడా గత విజయాల అనుభవాన్ని ఉపయోగించు కుంటారని.. కమిన్స్ చెప్పటంతో ఈ పోరు ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+