Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా హైదరాబాద్ లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 216 పరుగులు చేసింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభ ఓవర్లలోనే భారీ షాక్ తగిలింది. ఈ మధ్య భీకర పామ్ లో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు ముగ్గురు బ్యాట్స్ మెన్ తొలి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టారు.
ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన విదర్భ యువ బౌలర్ ప్రఫుల్ హింగే (praful hinge) చరిత్ర సృష్టించాడు. ఐపీఎ ల్ లో వేసిన తొలి ఓవర్ లోనే ఏకంగా మూడు వికెట్లు తీసి అబ్బుర పరిచాడు. రెండో బంతికే ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని క్యాచ్ అవుట్ చేసిన ప్రఫుల్.. అనంతరం నాలుగో బంతికి వన్ డౌన్ లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ధృవ్ జురెల్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఆరో బంతికి మరో బ్యాట్స్ మెన్ ప్రిటోరియస్ ను క్యాచ్ అవుట్ చేయడం ద్వారా ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన తొలి ఐపీఎల్ బౌలర్ గా ప్రఫుల్ నిలిచాడు. ప్రఫుల్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్లో ఒక పరుగు చేసి 3 వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్లో బౌలింగ్ చేసిన ప్రఫుల్ హింగే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ను స్లిప్ క్యాచ్ గా అవుట్ చేసి నాలుగో వికెట్ ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. 2024లో విదర్భ తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన హింగే..ఈ సీజన్ ఆరంభంలో జట్టులో నిలకడగా ఆడుతూ, ఆరు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అయితే, గత సంవత్సరం జరిగిన విదర్భ ప్రో టీ20 లీగ్ తొలి ఎడిషన్‌లో అతనికి టీ20లో తొలి అవకాశం లభించింది. అప్పుడు అతను నెకో మాస్టర్ బ్లాస్టర్స్ టైటిల్ వేటలో కీలక పాత్ర పోషించాడు. హింగే వేగవంతమైన పేసర్ అవుతాడని, ప్రత్యర్థులకు సవాలుగా మారతాడనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications