SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో మరో ఆసక్తికర పోరుకు ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో భీకర ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒకటే గెలిచి ఇబ్బందులు పడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో (SRH vs RR) తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్ ల చరిత్రను పరిశీలిస్తే సన్ రైజర్స్ దే పైచేయిగా ఉంది. అయితే రాజస్థాన్ తన ఫామ్ తో ఈ రికార్డును బ్రేక్ చేయబోతోందా అన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఈ రెండు జట్లలో ఎవరు గెలవబోతున్నారో తేల్చబోతోంది.

సన్ రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ (SRH vs RR)

ఐపీఎల్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వారి సొంతగడ్డప తలపడనుంది. ముల్లన్‌పూర్‌లో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ నాలుగో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత ఇవాళ రాజస్తాన్ తో మ్యాచ్‌కు సన్ రైజర్స్ సిద్ధమవుతోంది. గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ 219 పరుగులు చేసినా ఓడిపోయింది. మరోవైపు తమ నాలుగో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీని 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

SRH vs RR Vaibhav Sooryavanshi s Blistering Form Challenges Sunrisers Head-to-Head Dominance

రాజస్తాన్ పై సన్ రైజర్స్ పైచేయి

ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కు అనుకూలించే హైదరాబాద్ పిచ్ పై సన్ రైజర్స్.. రాజస్థాన్ పై విజయం కోసం ఎదురుచూస్తోంది. అయితే వైభవ్ సూర్యవంశీ రూపంలో హైదరాబాద్ కు అడ్డంకి ఎదురు కానుంది. దీంతో వైభవ్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఇరు జట్ల మధ్య ఐపీఎల్ లో గతంలో 21 మ్యాచ్ లు జరిగితే ఇందులో సన్ రైజర్స్ అత్యధికంగా 12 మ్యాచ్ లలో గెలిచి ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ రికార్డును బ్రేక్ చేసే దిశగా రాజస్థాన్ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇవాళ్టి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఎలెవెన్

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (C & WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్

SRH vs RR Vaibhav Sooryavanshi s Blistering Form Challenges Sunrisers Head-to-Head Dominance

రాజస్థాన్ రాయల్స్ ఎలెవెన్

వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్. ఇంపాక్ట్ ప్లేయర్: లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+