ఐపీఎల్‌లో దిక్కులేక.. పీఎస్ఎల్‌కు! (వీడియో)
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 వేలంలో ఏ జట్టూ తనను కొనుగోలు చేయకపోవడంతో చివరకు ప్రాణాలకు తెగించి మరీ పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆడేందుకు స్టీవ్ స్మిత్ లాహోర్ చేరుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. వేరే ఆప్షన్ లేక స్టీవ్ స్మిత్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
భారీ భద్రత మధ్య ఎయిర్పోర్టు నుంచి బయటకు
పాకిస్థాన్ చేరుకున్న స్టీవ్ స్మిత్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అత్యున్నత స్థాయి భద్రతను కల్పించింది. లాహోర్ విమానాశ్రయం నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, భారీ భద్రతా వలయం మధ్య స్మిత్ హోటల్‌కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వార్నింగ్ ఇచ్చిన ఉగ్ర ముఠా..
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకుంటామని 'జమాత్-ఉల్-అహ్రార్' అనే ఉగ్రవాద సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. "స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, డారిల్ మిచెల్ వంటి ప్లేయర్లు వెంటనే టోర్నీ నుంచి తప్పుకోవాలి. మీ భద్రతకు మేము గ్యారెంటీ ఇవ్వలేం. పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు క్రికెట్ ఆడేందుకు అనువైనవి కావు" అని ఆ సంస్థ కమాండర్ పేర్కొన్నారు. టోర్నీని అడ్డుకునేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో ప్లేయర్లలో ఆందోళన మొదలైంది.
STEVE SMITH HAS ARRIVED 🤯
— Salman. (@TsMeSalman) March 23, 2026
- Steve Smith landed in Pakistan for HBL PSL 11. A big message for those who doubted our security. 🤩🔥pic.twitter.com/orDNnLVu2Y
ఐపీఎల్ లేకే పీఎస్‌ఎల్ వైపు..?
ఒకప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన స్టీవ్ స్మిత్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. టీ20 ఫార్మాట్‌లో స్మిత్ బ్యాటింగ్ నెమ్మదించిందనే కారణంతో జట్లు మొగ్గు చూపలేదు. "భారత్‌లో ఐపీఎల్ క్రేజ్, భారీ కాంట్రాక్టులు దక్కకపోవడంతో, కనీసం పీఎస్‌ఎల్ ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాలని స్మిత్ భావిస్తున్నారు. కానీ, ప్రాణాలకు ముప్పు ఉన్న చోట కేవలం ఆట కోసం వెళ్లడం ఎంతవరకు సమంజసమని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
పీసీబీలో టెన్షన్.. టెన్షన్!
మరోవైపు పీసీబీకి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఉగ్ర ముప్పు కారణంగా విదేశీ ఆటగాళ్లు భీమా మొత్తాన్ని పెంచాలని లేదా అదనపు ఫీజులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లు పీఎస్‌ఎల్ ఒప్పందాలను రద్దు చేసుకుని ఐపీఎల్ వైపు చూస్తుండటం పాక్ క్రికెట్ బోర్డును కలవరపెడుతోంది. ఈ సవాళ్ల మధ్య స్టీవ్ స్మిత్ ఎంతవరకు రాణిస్తారో, పీఎస్‌ఎల్ 2026 సురక్షితంగా ముగుస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications