గుండె ఆగిపోయినంత పని అయింది: సూర్య షాకింగ్ కామెంట్స్!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఇంగ్లాండ్ జట్టుపై 7 పరుగుల స్వల్వ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. మ్యాచ్ క్లైమాక్స్ దశలో తన గుండె వేగం నిమిషానికి 160 నుంచి 175కి పెరిగిపోయిందని సూర్యకుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు.

హ్యారీ బ్రూక్‌తో సూర్యకుమార్ యాదవ్ సరదా సంభాషణ
భారత్ నిర్దేశించిన 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడాడు. ముఖ్యంగా జాకబ్ బెథెల్ (105) సెంచరీతో భారత్‌ను భయపెట్టాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌తో జరిగిన సంభాషణ గురించి సూర్య చెబుతూ.. "మీపై గెలవాలంటే మేము ఇంకా ఎన్ని పరుగులు చేయాలి? అని నేను హ్యారీ బ్రూక్‌తో అన్నాను. వారు లక్ష్య ఛేదనలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు, ఎప్పుడూ రేసులోనే ఉన్నారు. కానీ మా బౌలర్లు మ్యాచ్‌ను మా వైపు తిప్పిన తీరు అద్భుతం" అని సూర్య కొనియాడాడు.

Suryakumar Yadav Reveals Heart Rate Spiked to 175 During T20 World Cup Semifinal vs England

సంజూ శాంసన్ బ్యాటింగ్‌పై ప్రశంసలు
ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూ శాంసన్‌ను సూర్య ఆకాశానికెత్తేశాడు. "సంజూ శాంసన్ క్రీజులోకి వెళ్లినప్పుడే తనేం చేయాలో ఒక స్పష్టతతో ఉన్నాడు. వికెట్లు పడుతున్నా అతను ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. గత ఏడాది కాలంగా అతను పడుతున్న కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం దక్కింది. జట్టుకు కావాల్సిన ఇన్నింగ్స్ అతను ఆడాడు" అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

బౌలర్ల పోరాటం.. బుమ్రా మ్యాజిక్
భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా రాణించారని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. "బుమ్రా సామర్థ్యం ఏంటో మనందరికీ తెలుసు. క్లిష్ట సమయంలో అతను మరోసారి తన బాధ్యతను చాటుకున్నాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ చేతుల్లోంచి లాగేసుకున్నారు. అలాగే ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ కృషిని కూడా మరువలేం. ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అద్భుతంగా స్పందిస్తున్నారు" అని సూర్య వివరించాడు.

ఫైనల్ వేటలో భారత్
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం, టైటిల్ రేసులో ఉండటం కచ్చితంగా ఒత్తిడితో కూడుకున్న విషయమేనని, అయితే ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ అందరూ ఫైనల్ కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+