Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాడు రోహిత్- నేడు సూర్యా భాయ్: టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. పిచ్ కు ప్రణమిల్లాడు. అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నాడు. కప్ ను తీసుకుని కొద్దిసేపు పిచ్ పైనే మౌనంగా కూర్చుండిపోయాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్ సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు. తన తదుపరి లక్ష్యం ఏమిటో వెల్లడించాడు. 2028లో లాస్ ఏంజిల్స్‌ లో జరగనున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించడమే తన నెక్స్ట్ గోల్ అని చెప్పాడు. ఇది దేశానికి గర్వకారణమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Suryakumar Yadav says After T20 World Cup Final Eyeing Historic LA 2028 Olympic Debut in Cricket

ఒలింపిక్స్ లో కొత్తగా జత అయిన అయిదు స్పోర్ట్స్ ఈవెంట్స్ లల్లో ఒకటి.. క్రికెట్. క్రికెట్ తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్ ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలిపింక్స్ తో ఈ అయిదు గేమ్ లు కూడా మనుగడలోకి రాబోతోన్నాయి. ఆయా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఒలింపిక్స్ లోకి ఇంట్రడ్యూస్ కావడం అదే తొలిసారి కానుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ కు సంబంధించిన అర్హత ప్రమాణాలు ఏమిటనేది ఇంకా ఫైనల్ కాలేదు.

ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నందున ఈ లోపే అర్హత ప్రమాణాలు ఖరారవుతాయి. దాదాపు 100 దేశాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడడం వలన, అర్హత ప్రక్రియ తీవ్ర పోటీతో కూడుకుని ఉండబోతోంది. ఆతిథ్య దేశంగా అమెరికా ఈ టోర్నమెంట్‌లోకి ప్రత్యక్ష ప్రవేశం పొందే అవకాశం ఉంది. క్రికెట్ ఆడే దేశాల్లో అమెరికా కూడా ఒకటి. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడిందీ జట్టు. ఫర్వాలేదనిపించుకుంది.

క్రికెట్ సహా మిగిలిన నాలుగు స్పోర్ట్స్ ఈవెంట్ల అరంగేట్రాన్ని లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కమిటీ నిర్ధారించింది. దీనికి ఇంటర్నేషనల్ ఒలిపింక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది కూడా. 2028లో మొత్తం 351 ఈవెంట్‌లు జరగనున్నాయి. ఇది గత పారిస్ ఒలింపిక్స్ కంటే 22 ఈవెంట్లు ఎక్కువ. ప్రధాన అథ్లెట్ల కోటా 10,500. అయిదు కొత్త క్రీడల కోసం అదనంగా 698 మంది అథ్లెట్లను కేటాయించినట్లు ఐఓసీ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+