T20 World Cup 2024: ఇండియా , పాక్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ 'ఎ'లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయాసంగా నెగ్గిన భారత్ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక 2007 నుంచి జరుగుతున్న ఈ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాక్‌పై టీమిండియాదే పైచేయి సాధిస్తూ వస్తోంది.ఇండియాపై ఆడిన 7 మ్యాచ్‌లలో 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన పాకిస్తాన్ జట్టు.. మరోసారి తమ అదృష్టాన్ని చెక్ చేసుకోనుంది. 2007.2012,2014,2016,2022 సంవత్సరాల్లో జరిగిన టీ20 టోర్నీల్లో టీమిండియా విజయం సాధించగా, 2021లో ఒక్కసారి మాత్రమే ఇండియాపై పాకిస్థాన్ విజయం సాధించగలిగింది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఫ్యాన్స్ కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది అని పేర్కొనింది. ఆదివారం నాడు మ్యాచ్ జరిగే టైంలో న్యూయర్క్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని 'అక్యూ వెదర్' రిపోర్ట్ వెల్లడించింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో వర్షం పడితే ఎంతో కాలంగా వేచి ఉన్న క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురైనట్టే.












Click it and Unblock the Notifications