T20 World Cup 2024: ఆప్ఘన్ సెమీస్ ప్రస్ధానం వెనుక అజయ్ జడేజా ! ఎమోషనల్ ట్వీట్స్..
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)లో ఇవాళ పెను సంచలనం నమోదైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ లో పోరు ప్రారంభించిన భారత ఉపఖండపు పసికూన ఆప్ఘనిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. చూస్తుండగానే లీగ్ దశ నుంచి సూపర్ ఎయిట్ కు చేరిన ఆప్ఘన్ జట్టు.. ఇవాళ ఉత్కంఠ భరితంగా జరిగిన సూపర్ ఎయిట్ చివరి పోరులో పొరుగుదేశం బంగ్లాదేశ్ పై 8 పరుగుల తేడాతో గెలవడమే కాకుండా ఆసీస్, బంగ్లాను ఒకేసారి ఇంటికి పంపి సెమీస్ లోకి అడుగుపెట్టింది.
భారత్, ఆసీస్, బంగ్లాదేశ్ తో కూడిన సూపర్ ఎయిట్ గ్రూప్ 1లోకి ప్రవేశించిన అప్ఘన్ జట్టుపై ఎవరికీ సెమీస్ చేరుతుందన్న అంచనాల్లేవు. లీగ్ దశలో న్యూజీలాండ్ పై సాధించిన విజయం మినహాయిస్తే ఆప్ఘన్ ఇప్పటివరకూ సాధించిన మెరుపులు కూడా ఏమీ లేవు. సూపర్ ఎయిర్ గ్రూప్ 1 లో భారత్ పై ఓడిన తర్వాత కసిగా ఆస్ట్రేలియాపై సాధించిన విజయం కూడా గాలివాటంగానే కనిపించింది. ఈ దశలో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వడంతో ఆప్ఘన్, బంగ్లా మ్యాచ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ లోనూ బంగ్లాపై ఆప్ఘనిస్తాన్ గెలుస్తుందన్న అంచనాల్లేవు. కానీ అసాధ్యం కాస్తా సుసాధ్యమైంది.

తొలుత బ్యాటింగ్ చేసి 115 పరుగులే చేయడంతో ఆప్ఘన్ గెలవడం కష్టమే అని అంతా భావించారు. కానీ వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో 19 ఓవర్లలో 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ను అనితర సాధ్యమైన రీతిలో కట్టడి చేసిన ఆప్ఘన్ వీరులు 8 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో 4 పాయింట్లు సాధించి భారత్ తో సమంగా నిలలిచిన ఆప్ఘనిస్తాన్ ఒకేసారి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లను వరల్డ్ కప్ సూపర్ 8 దశ నుంచి ఇంటికి పంపింది. ఆప్ఘన్ విజయంపై భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Afghani 🇦🇫 Fans must Save this Video for their Future Players, just to show them, their was a Team, who defeated Mighty Australian, Bangladesh when their was 0% chance of Semi Final Qualification for Afg 👏
— Ajay Jadeja (@AjayJadeja171) June 25, 2024
Proud te be part of @ACBofficials #AFGvsBAN pic.twitter.com/carsQ0aDGN
అయితే ఆప్ఘనిస్తాన్ విజయాల వెనుక ఉన్నది ఆ జట్టు మెంటార్, టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. ఇవాళ ఆప్ఘన్ చారిత్రక విజయంతో సెమీస్ కు చేరిన వేళ జడేజా కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. భవిష్యత్తులో ఆఫ్గన్ అభిమానుల కోసం ఈ వీడియోను సేవ్ చేసుకోండి అంటూ ఇవాళ బంగ్లా చివరి వికెట్ కోల్పోవడం, అనంతరం జట్టు క్రికెటర్ల భావోద్వేగాల్ని ఎక్స్ లో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications