T20 World Cup: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ కు పిలుపు..!!

T20 ప్రపంచ కప్ లో టీమిండియాకు భారీ షాక్. స్టార్ బ్యాటర్ అనారోగ్యంతో ఇబ్బంది పడటం ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ కప్ యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా మొదటి మ్యాచ్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఆడని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు మరో షాకింగ్ న్యూస్. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో, స్టార్ ఆల్ రౌండర్ జట్టు లోకి రీ ఎంట్రీ ఖాయమైంది.

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా మొదటి మ్యాచ్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఆడలేదు. కాగా, విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడ్డాడు. శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిషేక్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఫీల్డింగ్‌ కూడా చేయలేదు. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేసారు. ఇప్పటికే బుమ్రా జ్వరం కారణంగా తొలి మ్యాచుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. నమీబియాతో గురు వారం జరిగే మ్యాచుకు వీరిద్దరూ అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. దీంతో.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలు విషయం బయటపెట్టారు. అభిషేక్ హఠాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారని, అందుకే ఆయనను విశ్రాంతి కోసం పంపాల్సి వచ్చిందని తెలిపారు.

t20-world-cup-abhishek-didnt-take-the-field-during-the-second-innings-with-usa-due-to-fell-ill-w

వాషింగ్టన్ సుందర్ రీ ఎంట్రీ

అభిషేక్ శర్మకు ఈ వరల్డ్ కప్ ఆరంభం అంత గొప్పగా లేదు. అమెరికాపై జరిగిన తన తొలి సీనియర్ ఐసీసీ మ్యాచ్‌లో కేవలం ఒక్క బంతి ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి తోడు అనారోగ్యం కూడా చుట్టుముట్టడంతో ఆయన కొంచెం నిరాశలో ఉన్నారు. అయితే, నమీబియాతో జరగబోయే మ్యాచ్ లో తన బ్యాట్‌తో సమాధానం చెప్పాలని అభిషేక్ కసితో ఉన్నాడు. కాగా, కెప్టెన్ సూర్య కుమార్ మరో కీలక అంశం వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గురువారం జరిగే మ్యాచుకు భారత జట్టుతో కలవనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. హర్షిత్ రాణా ఇప్పటికే గాయపడి టోర్నీ నుంచే తప్పుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వాషీ కోలుకోవడం టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే విషయం. ఇక, యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టీం ను ముందుండి గెలిపించాడు. బ్యాటర్లు వరుసగా తక్కువ స్కోరుకే అవుట్ అయినా.. చివరి వరకు క్రీజులో ఉండి ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచటంతో.. టీమిండియా తొలి మ్యాచ్ లో విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+