India vs West Indies: విండీస్ ను ఓడించకపోతే ఐపీఎల్ నుంచి వాళ్లంతా అవుట్ ?
టీ20 వరల్డ్ కప్ (t20 world cup)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి, ఆ తర్వాత వరుస విజయాలతో ఊపమీదున్న సమయంలో దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ కోల్పోయిన తర్వాత భారత్ పై ఒత్తిడి పెరిగింది. అయితే జింబాబ్వేపై గెలిచి ఊపిరిపీల్చుకున్న సూర్య సేనకు ఇవాళ కోల్ కతాలో వెస్టిండీస్ తో జరిగే సూపర్ 8 మ్యాచ్ కీలకంగా మారింది. ఈ పోరులో గెలిస్తే సెమీస్ కు, ఓడితే ఇంటికే అన్న పరిస్ధితి ఎదురుకావడంతో మరోసారి టీమిండియాపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో టీమిండియాకు మరింత ఒత్తిడి పెంచేలా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (manoj Tiwary)ఇవాళ కీలక హెచ్చరికలు చేశాడు. వెస్టిండీస్ ను ఇవాళ భారత్ ఓడించలేకపోతే జట్టులో క్రికెటర్లకు ఐపీఎల్ (ipl 026)కాంట్రాక్టులు ఉండవంటూ సుతి మెత్తగా హెచ్చరికలు చేశాడు. భారత్ తమ చివరి మ్యాచ్‌లో 256 పరుగులు చేసింది, కాబట్టి దాన్ని ఈసారి అధిగమించాలి. వారిపై ఎటువంటి ఒత్తిడి లేదని, 200 కంటే ఎక్కువ స్కోరు చేసి వెస్టిండీస్‌ను సులభంగా ఓడించాలనేది అంచనా అని తెలిపాడు.

వారు వెస్టిండీస్‌ను ఓడించలేకపోతే, ఎవరికీ ఐపీఎల్ కాంట్రాక్టులు లభించవంటూ క్రిక్‌బజ్‌లో జరిగిన చర్చ సందర్భంగా మనోజ్ తివారీ అన్నారు. అయితే ఈ చర్చ సమయంలో మనోజ్ తివారీతో పాటు ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ ఈ అభిప్రాయంతో విభేదించాడు. ఇది జరగవచ్చు, మనం అజేయులమని, ఎవరితోనూ ఓడిపోలేమని కాదన్నాడు. ఇతర జట్టు కూడా ఆడటానికి , గెలవడానికే ఇక్కడ ఉందన్నాడు. మన దేశం చాలా భావోద్వేగానికి గురవుతుందని, వారు చాలా త్వరగా భావోద్వేగానికి గురవుతారని, ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, మేము ప్రపంచ కప్‌ను ఓడిపోయినట్లుగా ప్రజలు స్పందిస్తున్నారని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications