సీఎం విజయ్‌కు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!
తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కోలీవుడ్ స్టార్ హీరో, దలపతి విజయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈ సారి విజయ్ వార్తల్లో నిలవడానికి రాజకీయాలో లేదా సినిమాలో కారణం కాదు.. టీమిండియా రన్ మెషీన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి దలపతి విజయ్‌కు అందిన ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్. సాంప్రదాయ శైలిలో విరాట్ కోహ్లీ సంతకం ఉన్న బ్యాట్‌ను పట్టుకుని విజయ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఆయనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు, అరుదైన బహుమతులు అందుతూనే ఉన్నాయి. ఇటీవలే ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ఆయనకు ఓ ప్రత్యేకమైన నంబర్ ప్లేట్‌ను బహుమతిగా ఇవ్వగా.. తాజాగా ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ ప్రతినిధుల బృందం సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో భాగంగా ఎంఆర్‌ఎఫ్ ఛైర్మన్ అండ్ ఎండీ కేఎం మమ్మన్, వైస్ చైర్మన్ అరుణ్ మమ్మన్, ఎండీ రాహుల్ మమ్మన్‌లు విజయ్‌కు విరాట్ కోహ్లీ స్వయంగా సంతకం చేసిన ఓ స్పెషల్ క్రికెట్ బ్యాట్‌ను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో కంపెనీ వ్యాపారాలు, కార్యకలాపాలపై కూడా చర్చలు జరిగాయి.

ఈ భేటీకి సంబంధించిన వైరల్ అవుతున్న ఫోటోలలో సీఎం విజయ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన బ్లాక్ కలర్ సూట్, వైట్ ఓపెన్ కాలర్ షర్ట్ ధరించి.. దానికి సాంప్రదాయ ముద్రను జోడిస్తూ భుజంపై బంగారు అంచు గల తెల్లటి వేష్టిని వేసుకున్నారు. విరాట్ కోహ్లీ సిగ్నేచర్ ఉన్న బ్యాట్‌ను చేతబూని ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ విజయ్ ఇచ్చిన ఫోజులు చూసి ఇరు రంగాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాల పేర్లు కనిపించడంతో ఈ ఫోటోలు నెట్టింట క్షణాల్లో వైరల్ అయ్యాయి.
ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మే 10, 2026న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకవైపు పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉంటూనే విజయ్ తన సినిమా కెరీర్‌ను కూడా కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'జన నాయగన్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications