పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకున్న ఏకైక భారత ఆటగాడు నువ్వే సామి..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. టోర్నమెంట్‌లోనే హైఓల్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 2.30 గంటల నుంచి ఈ దాయాదిల పోరు ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌పై ఇండియాకు మంచి రికార్డ్ ఉన్నప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్ కొన్నిసార్లు మనపై పైచేయి సాధించింది.గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించిన అనుభవం పాకిస్థాన్‌కు ఉంది.
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును పాకిస్థాన్ ఓడించింది. ఎనిమిదేళ్ల పగ తీర్చుకునేందుకు భారత్ రంగంలోకి దిగనుండగా, మరోసారి భారత్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాలని పాకిస్థాన్ భావిస్తోంది.ఈ వేదికపై భారత్-పాకిస్తాన్ జట్లు 28 వన్డే మ్యాచ్‌లలో తల పడ్డాయి. వాటిలో పాకిస్తాన్ 19 మ్యాచ్‌లలో గెలిస్తే.. భారత్ కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. అంటే.. దుబాయ్ గ్రౌండ్‌లో భారత్‌పై డామినేషన్ పాకిస్తాన్‌దే.కాబట్టి టీమిండియా పాకిస్థాన్ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు.

దేశమంతా భారత జట్టు గెలవాలని ప్రార్థనలు చేస్తున్న వేళ ఓ మాజీ భారత క్రికెటర్ మాత్రం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవాలనుందని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. టీమిండియా మాజీ ఆటగాడు అతుల్ వాసన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవాలని తాను కోరుకుంటున్నానని అతుల్ వాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను పాకిస్థాన్ గెలవాలని అనుకుంటున్నా. అప్పుడే మజా వస్తుంది. ఒకవేళ పాకిస్థాన్‌ను గెలవనీయకపోతే ఏం జరుగుతుంది? పాకిస్థాన్ గెలిస్తే అప్పుడే అసలైన పోటీ మొదలవుతుంది. ఇద్దరి మధ్య పోరు సమంగా ఉండాలని అతుల్ వాసన్ అభిప్రాయడపడ్డాడు. అయితే అతుల్ వాసన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అతను చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అతుల్ వాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications