రోహిత్, కొహ్లీకి బీసీసీఐ అల్టిమేటం..! ఒప్పుకుంది ఒక్కరే..!

భారత క్రికెట్లో, ముఖ్యంగా పురుషుల క్రికెట్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న యువ క్రికెటర్లతో పోటీ పడుతూ జట్టులో చోటు నిలబెట్టుకోవడం సీనియర్లకు కష్టసాధ్యంగా మారుతోంది. అదే సమయంలో వీరిని కొనసాగించడం బీసీసీఐకి కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ సీనియర్ క్రికెటర్లు అయిన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మకు ఓ కీలక సంకేతం పంపింది. దీన్ని అర్ధం చేసుకుని వీరిద్దరూ స్పందించాల్సి ఉంది. అయితే ఒక్కరే స్పందించారు.

వన్డే జట్టులో యువ క్రికెటర్ల రాకతో సీనియర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరి స్ధానాలకు తాజాగా ముప్పు ఏర్పడుతోంది. ఈ మధ్యే ఆస్ట్రేలియా టూర్ లో జరిగిన వన్డే సిరీస్ లో తొలుత విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీని మరోసారి ఎంపిక చేయకూడదనే డిమాండ్లు వచ్చాయి. దీంతో చివరి వన్డేలో తప్పనిసరి పరిస్ధితుల్లో రోహిత్, కొహ్లీ బ్యాట్ ఝళిపించారు. అయినా దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే వన్డే సిరీస్ లో వీరిని ఎంపిక చేయాలంటే దేశవాళీ క్రికెట్ ఆడించాల్సిందేనని బీసీసీఐ ఓ అభిప్రాయానికి వచ్చేసింది.

The BCCI Ultimatum Kohli Rohit Instructed to Play Domestics Rohit Sharma s Reply

దీంతో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడితేనే వన్డే జట్టులోకి ఎంపిక చేస్తామంటూ బీసీసీఐ వీరిద్దరికీ అల్టిమేటం ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ తప్పకుండా పాల్గొనాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. అయితే బీసీసీఐ చేసిన ప్రతిపాదన వీరికి అంగీకారమో కాదో కొహ్లీ, రోహిత్ ఇద్దరూ స్పందించాల్సి ఉంది. కానీ ఇందులో రోహిత్ మాత్రమే స్పందించి దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తనకు అంగీకారమేనని బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. కొహ్లీ మాత్రం స్పందించలేదు.

The BCCI Ultimatum Kohli Rohit Instructed to Play Domestics Rohit Sharma s Reply

ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరూ ఇప్పుడు వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు వీరు అంగీకరిస్తే సరి, లేకపోతే వన్డే టోర్నీలకు సైతం వీరిని ఎంపిక చేయడం కష్టమే. అప్పుడు బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్ధితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమైన తర్వాత, బీసీసీఐ ఇలాంటి ఆదేశం జారీ చేసింది. దీంతో కోహ్లీ-రోహిత్ ఇద్దరూ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి ఒక్కో మ్యాచ్ ఆడారు. నవంబర్ 26న ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ సంఘానికి రోహిత్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+