Ind vs SA ODI: వైజాగ్ లో కొహ్లీ రికార్డుపై టెన్షన్ లో పాక్ మాజీ కెప్టెన్ ?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ విశాఖలో జరిగే మూడో వన్డేలో విజయం కోసం ఇరుజట్లూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలవడంతో సిరీస్ గెలుపు కోసం మూడో వన్డే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లోనూ భారత్ గెలిచి తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కొహ్లీ మళ్లీ సెంచరీ చేస్తాడని వారు అంచనా వేస్తున్నారు.
విశాఖ వన్డేలో విరాట్ కొహ్లీ సెంచరీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ సిరీస్ లో విరాట్ కొహ్లీ వరుసగా రెండు వన్డేల్లోనూ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు విశాఖలోనూ సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ పూర్తవుతుంది. అయితే గతంలోనూ ఓసారి హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన రికార్డు కొహ్లీ పేరిట ఉంది. కానీ కొహ్లీ కంటే ముందు రెండుసార్లు ఈ రికార్డు సాధించిన క్రికెటర్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం.

గతంలో రెండుసార్లు వరుసగా మూడేసి సెంచరీలు బాదిన పాక్ మాజీ కెప్టెన్ కమ్ ఓపెనర్ బాబర్ ఆజం ఇలా అరుదైన ఫీట్ తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పటికే ఓసారి ఇలా వరుసగా మూడు వన్డేల్లో సెంచరీలు బాదిన కొహ్లీకి.. మరోసారి మాత్రం ఇలాంటి అవకాశం దక్కలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ఆకలితో ఉన్న పిలులా విజృంభిస్తున్న కింగ్.. విశాఖలో ఆ రికార్డు సమం చేసేందుకు మంచి అవకాశం వచ్చింది. దీంతో విశాఖలో కింగ్ విరాటరూపం ప్రదర్శిస్తే బాబర్ ఆజం రికార్డు సమం అవుతుంది. దీంతో కొహ్లీకి మంచి ఫ్రెండ్ అయిన బాబర్ కూడా దీని కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు.












Click it and Unblock the Notifications