Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!

హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్, ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా కూడా ఉన్న తిలక్ వర్మ (Tilak Varma) ఇవాళ ఓ వరల్డ్ రికార్డు సృష్టించాడు. క్రైస్ట్ చర్చ్ లో న్యూజీలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో తిలక్ వర్మ ఈ ఘనత సాధించాడు. అయితే అతను ఈ వరల్డ్ రికార్డు సాధించింది బ్యాటింగ్ లో కాదు. ఫీల్డర్ గా మాత్రమే. దీంతో గతేడాదిగా పదిలంగా ఉన్న ఈ రికార్డు సాధనతో తిలక్ వర్మ చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు.

విదేశీ కోచ్ ఘాతుకం.. మైనర్ అథ్లెట్‌పై అత్యాచారం!
విదేశీ కోచ్ ఘాతుకం.. మైనర్ అథ్లెట్‌పై అత్యాచారం!

న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ రెండు క్యాచ్‌లు అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 2026 క్యాలెండర్ సంవత్సరంలో పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టడంతో అతడి మొత్తం క్యాచ్‌ల సంఖ్య 26కు చేరింది. ఇంతకుముందు ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హవో 2025లో 25 క్యాచ్‌లు అందుకుని ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు తిలక్ వర్మ ఆ రికార్డును అధిగమించి కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.

Tilak Varma Makes T20I History Surpasses World Record During India vs New Zealand Clash
కివీస్ తో రెండో టీ20కి స్టార్ బ్యాట్స్ మెన్ అవుట్..! వైభవ్ కు ఛాన్స్..!
కివీస్ తో రెండో టీ20కి స్టార్ బ్యాట్స్ మెన్ అవుట్..! వైభవ్ కు ఛాన్స్..!

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫీల్డింగ్ లో మైదానంలో వేగంగా కదులుతాడనే పేరున్న తిలక్ వర్మ.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ క్యాచ్‌ను కూడా పట్టుకున్నాడు. దీంతో భారత జట్టుకు కీలక ఆరంభ వికెట్లు దక్కాయి. ఈ రెండు క్యాచ్ లతో వరల్డ్ రికార్డు సాధించిన తిలక్ వర్మ.. ఈ సిరీస్ లో బ్యాట్ అండ్ ఫీల్డింగ్ తో సత్తా చాటుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఈ వరల్డ్ రికార్డు కూడా అందుకోవడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించిన తిలక్ వర్మ ఓ సిక్స్, ఆరు ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ చేశాడు. అంతే కాదు మరో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డితో కలిసి అభేద్యమైన ఏడో వికెట్ కు 69 పరుగులు జోడించి భారత్ కు వరుసగా రెండో మ్యాచ్ లో గెలుపు అందించాడు. దీంతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఐదు టీ20ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+