IPL 2024: ఆ కంగారూల పీడకల కోసం ఐపీఎల్ జట్ల పోటా పోటీ ? రేసులో వీరే..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ గత సీజన్లతో పోలిస్తే అభిమానులకు మరింత మజా పంచేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే టోర్నీలో అన్ని జట్లూ మినీ వేలంలో కోట్ల రూపాయలు పెట్టి స్టార్ క్రికెటర్లను తెచ్చుకున్నాయి. వీరంతా అంచనాలకు తగ్గట్టుగా ఆడితే ఈ మెగా టోర్నీ అభిమానులకు అసలైన క్రికెట్ విందు పంచడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వీరందరి కంటే ఇప్పుడు తాజాగా ఎలాంటి అంచనాల్లేకుండా జాతీయ జట్టు తరఫున సంచలనాలు రేపుతున్న మరో క్రికెటర్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిపోయాడు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన పేస్ బౌలింగ్ తో కంగారూ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తున్న విండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్ గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని జట్లూ చర్చించుకుంటున్నాయి. తమ జట్టులో ఇలాంటి ఓ బౌలర్ కచ్చితంగా ఉండి తీరాలని కోరుకుంటున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ కూడా షమార్ జోసెఫ్ లాంటి బౌలర్ తమ జట్లలో ఎందుకు లేడనే అంతర్మథనంలో ఉన్నాయి.

tough competition among ipl teams to grab that kangaroos nightmare caribbean pace sensation

ఇప్పటికే ఐపీఎల్ మినీ వేలం పూర్తి కావడం, దాదాపుగా ఈసారి ఐపీఎల్ లో ఆడే జట్లను ఖరారు చేసేసుకోవడం కూడా పూర్తయినా షమార్ జోసఫ్ ను తమ జట్టులోకిఎ ఎలాగైనా తీసుకోవాలని మూడు జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. కంగారూలకు పీడకలగా మారిపోయిన షమార్ జోసెఫ్ తమ జట్టులోకి వస్తే కచ్చితంగా ఈసారి టోర్నీ మనదే అన్న ధీమాలో ఆయా జట్లు కనిపిస్తున్నాయి.

ముందుగా ఆర్సీబీ విషయానికొస్తే.. ఇప్పటికే విండీస్ పేసర్ అల్గారీ జోసెఫ్ ను తీసుకుంది. అయినా పేసర్లకు అనుకూలించే హోమ్ పిచ్ చిన్నస్వామి స్టేడియంలో షమార్ జోసెఫ్ వంటి పేసర్ అవసరమని ఆర్సీబీ భావిస్తోంది. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తెచ్చుకున్నా షమార్ జోసెఫ్ వంటి సంచలనం అవసరమని కోల్ కతా నైట్ రైడర్స్ భావిస్తోంది. అటు ముంబై ఇండియన్స్ సైతం తమ జట్టులో ఇప్పటికే జట్టులో ఉన్న బౌలర్లకు షమార్ జోసెఫ్ కలిస్తే ఈసారి టోర్నీ మనదే అన్న భావనలో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+