వైభవ్ సూర్యవంశీ ఫటాఫట్ 190 ఇన్నింగ్స్..! బీహార్ వరల్డ్ రికార్డ్..!

భారత క్రికెట్లో తన మెరుపులతో వరుసగా రికార్డులు చెరిపేస్తున్న బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇవాళ మరో భీకర ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న లిస్ట్ ఏ మ్యాచ్ లో ఏకంగా 190 పరుగులు చేశాడు. దీంతో బీహార్ ఎవరూ ఊహించని విధంగా 574 పరుగులు చేసి ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించింది. వైభవ్ భారీ ఇన్నింగ్స్ సాయంతో బీహార్ ఈ అరుదైన స్కోరు సాధించింది.

లెఫ్ట్ హ్యాండ్ స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి ఇవాళ మరో చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచీ బౌలర్లపై తనదైన శైలిలో ఎదురుదాడికి దిగిన వైభవ్.. మైదానం నలువైపులా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇది భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన సూర్యవంశీ.. 84 బంతుల్లో 190 చేసి తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. అప్పటికే బీహార్ 27 ఓవర్లలో 260 పరుగులు దాటింది.

Vaibhav Suryavanshi s Explosive 190 Off 84 Balls Powers Bihar to World Record 574

వైభవ్ సూర్యవంశీ తన 190 పరుగులు సాధించే క్రమంలో అనేక ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.అలాగే ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన 150 పరుగులు చేసిన ఎబి డివిలియర్స్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.దీంతో బీహార్ జట్టు ఒకే లిస్ట్ ఎ మ్యాచ్‌లో 'ప్రపంచ రికార్డు'లో నాలుగో స్థానంలో నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ జట్టు, 2022లో అరుణాచల్‌పై నమోదు చేసిన తమిళనాడు జట్టు 506/2 పరుగులను అధిగమించి, 574/6 'ప్రపంచ రికార్డు' ఇన్నింగ్స్ స్కోరుతో జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+