Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup ఫైనల్ వీళ్ల మధ్యే-కెవిన్ పీటర్సన్ షాకింగ్ జోస్యం..!

టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) సెమీ పైనల్ దశలో ఉంది. ఇప్పటికే నిన్న జరిగిన తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయంతో న్యూజీలాండ్ ఫైనల్లో బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక ఇవాళ జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లాండ్ (india vs england) తలపడబోతున్నాయి. వీరిలో గెలిచే జట్టు రెండో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఫైనల్ ఈ నెల 8న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రెండో సెమీస్ లో గెలిచెదేవరో ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ (kevin petersen) వెల్లడించాడు.

ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ ఆట నుంచి తప్పుకున్నా క్రికెట్ అనుబంధ కోచింగ్, ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ను సైతం క్లోజ్ గా ఫాలో అవుతున్న కేపీ.. ఇవాళ ఎక్స్ లో వరల్డ్ కప్ ఫైనలిస్టులపై తన అంచనాను వెల్లడించాడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్యే వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతోందని పీటర్సన్ జోస్యం చెప్పాడు. అంటే ఇవాళ భారత్ పై ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని పీటర్సన్ అంచనా వేస్తున్నాడు.

Kevin Petersen Predicts England vs New Zealand T20 World Cup Final

అయితే ఎక్స్ లో పీటర్సన్ ఈ ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తోంది. ఇవాళ రెండో సెమీ పైనల్ గెలిచేది టీమిండియానే అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు నైస్ జోక్ అంటూ పీటర్సన్ ను ఆడుకుంటున్నారు. ఇంకొందరు అయితే ముంబైలో ఇవాళ టాస్ గెలిస్తే ఇంగ్లండ్ గెలిచే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో మంచు వాతావరణంలో టాస్ కీలకం కాబోతుందని చెప్తున్నారు. పీటర్సన్ అంచనాపై గ్రోక్ ను ప్రశ్నిస్తే.. భారత్ ను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేయగలిగి, వారి టాప్ ఆర్డర్ ఫైర్ అయితే అవకాశం ఉందని సమాధానం ఇస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+