Vinesh Phogat Verdict: కాసేపట్లో వినేష్ ఫోగట్ తీర్పు-దేశవ్యాప్తంగా ఉత్కంఠ..!
పారిస్ ఒలింపిక్స్ లో ఫ్రీస్టైల్ 50 కేజీల మహిళల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరుకుని పతకంపై ఆశలు రేపిన వినేష్ ఫోగట్.. తుది పోటీలకు ముందు 100 గ్రాముల బరువు పెరిగి వాటిని నీరుగార్చేసింది. దీంతో కాంస్య పతకం మాట అటుంచి అనర్హత వేటు పడి నిరాశగా స్వదేశానికి చేరుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. అయితే సెమీస్ లో గెలిచాక బరువు పెరిగింది కాబట్టి కనీసం కాంస్య పతకం అయినా దక్కుతుందన్న ఆశతో అంతర్జాతీయ క్రీడా కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఉమ్మడి రజత పతకం ఇవ్వాలన్నఫోగట్ వినతిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. దీని కోసం భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ ముందు తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ అప్పీల్ చేసిన తర్వాత గత శుక్రవారం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత శనివారం తీర్పు వస్తుందని ఆశించినా ఆలస్యమైంది. దీంతో ఇవాళ రాత్రి 9.30 లోపు తీర్పు ఇవ్వబోతోంది.

అయితే ఈ వ్యవహారంలో వినేష్ అభ్యర్ధనను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) వ్యతిరేకించింది. దీంతో ఇప్పుడు కోర్టు ఇచ్చే తీర్పుపై దీని ప్రభావం ఎలాా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అభిప్రాయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటే మాత్రం వినేష్ కు ఉత్కంఠ తప్పకపోవచ్చు. అలా కాకుండా వినేష్ అభిప్రాయంతో ఏకీభవిస్తే మాత్రం ఉమ్మడి రజత పతక విజేత కానుంది. దీంతో దేశంలో క్రీడావర్గాలు కూడా ఈ తీర్పును ఆసక్తిగా గమనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications