ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ.. న భూతో న భవిష్యత్..

ఐపీఎల్ -2025 సీజన్ లో ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్‌ వేదికగా ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ లో ఇప్పటికే అనేక రికార్డులు నెలకొల్పిన కోహ్లీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ శిఖర్ ధావన్ ను కోహ్లీ అధిగమించాడు. దీంతో ఐపీఎల్ లో నయా చరిత్ర లిఖించాడు.
ఐపీఎల్ లో కోహ్లీ మొత్తం 770 ఫోర్లు నమోదు చేశాడు.

Virat Kohli Becomes Player with Most Fours in IPL History

ధావన్ ఈ ఘనతను 221 ఇన్నింగ్స్ లో సాధించాడు. అయితే 258వ ఇన్నింగ్స్ లోనే విరాట్ కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. కోహ్లీ గతంలోనూ ఐపీఎల్ 2016 లో 973 పరుగులు, ఐపీఎల్ 2024 లో 741 పరుగులు రాబట్టాడు. అదే సమయంలో గేల్ 2012, 13 సీజన్లలో వరుసగా 700లకు పైగా పరుగులు చేశాడు.

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనలో పోరులో కోహ్లీ 35 బంతుల్లో 3 ఫోర్లు బాది 43 పరుగులు చేశాడు. 14.5 ఓవర్‌ లో అజ్మతుల్లాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ప్రస్తుతం ఆర్సీబీ 18 ఓవర్లకు 173 పరుగులు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+