మెస్సి కాదు..నా ఫేవరెట్ ఫుట్‌బాల్ ప్లేయర్ అతనే: విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ... ది రన్ మెషీన్. క్రికెట్‌లో సాధించాల్సిన అన్ని రికార్డులు సాధించేశాడు. అందరి రికార్డులు దాదాపుగా చెరిపివేశాడు. అందుకే కింగ్ కోహ్లీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. డిసెంబర్ 13వ తేదీన ప్రపంచ సాకర్ ఆటగాడు మెస్సీ హైదరాబాదు వస్తున్న వేళ విరాట్ కోహ్లీ పేరు ఎక్కువగా నెట్టింట్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో మెస్సీపై విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ కొందరు నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ గతంలో కింగ్ కోహ్లీ మెస్సీపై చేసిన కామెంట్స్ ఏంటి..? ఆ కామెంట్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఫుట్‌బాల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇటీవల, ఆయన ఫుట్‌బాల్ దిగ్గజాలైన క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలలో తనకు ఇష్టమైన ఆటగాడిని వెల్లడించారు.ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం సులభం కాదు అని కోహ్లీ ఒప్పుకున్నప్పటికీ, మైదానంలో రొనాల్డో చూపించే శక్తి, ఆత్మవిశ్వాసం ఆయనను మెప్పించింది. ఫలితంగా, కోహ్లీ రొనాల్డోని తన ఫేవరేట్ ఆటగాడుగా ఎన్నుకున్నారు.

నా దృష్టిలో క్రిస్టియానో రొనాల్డోనే అత్యంత సమగ్రమైన ఆటగాడు. ఎడమ పాదం అయినా, కుడి పాదం అయినా, వేగం గానీ డ్రిబ్లింగ్ గానీ అతను ప్రతి అంశంలోనూ అద్భుతం అని కోహ్లీ అన్నారు.
ఇంత గొప్ప గోల్ స్కోరర్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. క్రీడను కొత్త స్థాయికి తీసుకెళ్లి, ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసిన రొనాల్డో స్థానం ప్రత్యేకం అని ఆయన పేర్కొన్నారు.
మెస్సీ-రొనాల్డో చర్చపై కోహ్లీ కొనసాగిస్తూ ,ఇది పూర్తిగా వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. మెస్సీ అసాధారణ సహజ ప్రతిభావంతుడు.అతని సామర్థ్యం నిజంగా సాటిలేనిది అని పేర్కొన్నారు.
అయితే, ఆటలో ప్రతి నిమిషం కృషి చేయాలన్న సంకల్పమే రొనాల్డోను ప్రత్యేకంగా నిలబెడుతుందని ఆయన నొక్కి చెప్పారు.ఉన్నత స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడికి ప్రతిభ ఉంటుంది, కానీ రొనాల్డోలాంటి సంకల్పం, పట్టుదల ఎవరికీ లేదు అనిపిస్తుంది," అని కోహ్లీ తన అభిప్రాయాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications