World Cup Final: భారత్ గెలిస్తే బీచ్ లో నగ్నంగా ! తెలుగునటి యూటర్న్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం. దీంతో ఫైనల్లో భారత్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. అదే సమయంలో టీమిండియా క్రికెటర్లకు ఉత్సాహం ఇచ్చేందుకు పలువురు నటీమణులు, మోడళ్లు బోల్డ్ ఆఫర్లు ఇచ్చేశారు.
ఇదే క్రమంలో తెలుగునటి రేఖా బోజ్ టీమిండియా గెలిస్తే ఏకంగా బీచ్ లో నగ్నంగా పరిగెడతానంటూ తాజాగా ఆఫర్ ఇచ్చింది. బీచ్ స్ట్రీక్ పేరుతో విదేశాల్లో నగ్నంగా చేసే పరుగును ఆమె వైజాగ్ బీచ్ లో చేస్తుందని అంతా భావించారు. కానీ ఆమె తాజాగా ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. భారత్ గెలిస్తే నగ్నంగా పరిగెత్తుతా.. కానీ అంటూ రేఖా బోజ్ చేసిన వ్యాఖ్యలు ఆమె యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి.

భారత్ వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్లో నగ్నంగా పరిగెత్తుతానంటూ (స్ట్రీకింగ్) ఆఫర్ ఇచ్చిన తెలుగు నటి రేఖా బోజ్.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. 'విదేశాల్లో ఫ్యాన్స్ పట్టరాని ఆనందంతో బట్టలు విప్పుకుని పరిగెత్తుతారని, ఇండియా గెలిస్తే తానూ అలాగే చేస్తానని చెప్పారు. కానీ అందరి ముందు చేస్తానని, కెమెరా ముందు చేస్తానని చెప్పలేదన్నారు. తాను మాత్రం ఇండియన్ స్టైల్లో పట్టు చీర కట్టుకుని, జెండా చేతబట్టి పరిగెత్తుతా అంటూ రేఖ క్లారిటీ ఇచ్చారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications