Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ అర్జున, ఖేల్ రత్న అవార్డులు వెనక్కి-ఢిల్లీ కర్తవ్యపథ్ దగ్గర వదిలేసి..
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతోంది. బ్రిజ్ భూషణ్ ను భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఓ మహిళకు ఆ పదవి ఇవ్వాలని రెండు దఫాలుగా రెజ్లర్లు నిరసనలు చేసినా కేంద్రం ఎన్నికలు నిర్వహించి చేతులు దులిపేసుకుంది. దీంతో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ఆ పదవిలోకి వచ్చేశాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రెజ్లర్లు ఒక్కొక్కరిగా తమ నిరసన తెలుపుతున్నారు.
తొలుత సాక్షిమాలిక్ తన కెరీక్ కు గుడ్ బై చెప్పేసి రిటైర్మెంట్ ప్రకటన చేసేసింది. ఆ తర్వాత మరో రెజ్లర్ భజరంగ్ పూనియా తనకు వచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇచ్చేశాడు. ఇవాళ మరో మేటి రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా తనకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన అర్జున, ఖేల్ రత్న అవార్డుల్ని వెనక్కి ఇచ్చేసింది. అయితే అంతకు ముందు ప్రధాని నరేంద్రమోడీని కలిసి తన ఆవేదన చెప్పుకోవాలని ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీలోని కర్తవ్యపథ్ ప్లాట్ ఫాంపైనే వాటిని ఉంచేసి వెళ్లిపోయింది.

ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్ ఇవాళ ఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను వదిలిపెట్టి, దేశంలోని మహిళా మల్లయోధుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులు, రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడు అయిన డబ్ల్యుఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఎన్నిక, అనంతర పరిణామాలపై ఆమె ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు.
यह दिन किसी खिलाड़ी के जीवन में न आए। देश की महिला पहलवान सबसे बुरे दौर से गुज़र रही हैं। #vineshphogat pic.twitter.com/bT3pQngUuI
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 30, 2023
వినేష్ ఫోగట్ తన అవార్డులను ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం బయట వదిలిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే కర్తవ్య పథ్ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వినేష్ తన అవార్డులను కర్తవ్య పథ్ లో వదిలివేయాలని నిర్ణయించుకుంది.
మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని నిరాశ వ్యక్తం చేస్తూ తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు వినేష్ ఫోగట్ లేఖలో పేర్కొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications