బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీ: లెజెండర్ల సరసన టీమిండియా డాషింగ్ ప్లేయర్
Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌పై భారత్.. పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్‌లో 445కు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్‌లోనూ స్కోర్ బోర్డును 400 పరుగులను దాటించింది. నాలుగు వికెట్ల నష్టానికి 430 పరుగల వద్ద ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది.
డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తన దూకుడును కొనసాగించాడు. డబుల్ సెంచరీ చేశాడు. 214 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ బాదాడీ బ్యాటర్. వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియాకు చెందిన మూడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఇదివరకు వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించారు. బ్యాక్ అండ్ బ్యాక్ టెస్టుల్లో వారిద్దరూ డబుల్ సెంచరీ చేశారు. ఆ ఇద్దరు లెజెండర్ల సరసన నిలిచాడు యశస్వి జైస్వాల్. టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీ సాధించిన మూడో అతిపిన్న వయస్కుడు కూడా అతనే.
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ వయస్సు 22 సంవత్సరాల 49 రోజులు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. 21 సంవత్సరాల 54 రోజుల వయస్సులో కాంబ్లి.. టెస్టుల్లో రెండో సెంచరీ అందుకున్నాడు. ఆయన తరువాత డాన్ బ్రాడ్‌మన్- 21 సంవత్సరాల 318 రోజులు, గ్రేమ్ స్మిత్- 22 సంవత్సరాల 173 రోజులు ఉన్నారు.
టీమిండియా ఇన్నింగ్ డిక్లేర్ తరువాత క్రీజ్‌లోకి దిగిన ఇంగ్లాండ్ తడబడుతోంది. 18 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ జాక్ క్రాలీ 11 పరుగులకు జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్ సెంచరీ హీరో బెన్ డకెట్.. నాలుగు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.












Click it and Unblock the Notifications