టీమిండియాలో బయటపడ్డ విభేదాలు .. గిల్‌ ,జైస్వాల్ మధ్య మాటల యుద్ధం

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను విషాదకరంగా ముగించాడు. డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో ఉండగా రనౌట్ కావడంతో, సహచర కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌పై యశస్వీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

టీమిండియా ఇన్నింగ్స్ 92వ ఓవర్‌లో జైదెన్ సీలెస్ వేసిన రెండో బంతిని యశస్వీ జైస్వాల్ మిడాఫ్ వైపు కొట్టాడు. సులభంగా పరుగు పూర్తవుతుందని భావించిన యశస్వీ, నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ వైపు చూస్తూ పరుగు తీయడం ప్రారంభించాడు. అయితే, గిల్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, సగం పిచ్ దాటిన జైస్వాల్ వెనక్కి తిరిగి క్రీజులోకి వచ్చేలోపు విండీస్ ఫీల్డర్ రనౌట్ పూర్తి చేశాడు.

Yashasvi Jaiswal Furious at Shubman Gill After Run Out Misses Double Century Video Goes Viral

రనౌట్ అయిన వెంటనే, యశస్వీ జైస్వాల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. క్రీజులోనే అసహనం వ్యక్తం చేస్తూ, "ఇట్స్ మై కాల్ (పరుగు కోసం పిలవడం నాదే బాధ్యత)" అని కెప్టెన్ గిల్‌పై కోపంగా అరుస్తూ కనిపించాడు. డబుల్ సెంచరీ అవకాశం చేజారిన బాధతో చేతితో తలను కొట్టుకుంటూ డగౌట్‌కు వెళ్లడం అభిమానులను కలచివేసింది.

శుభ్‌మన్‌ గిల్‌ నిర్లక్ష్యం వల్లే యశస్వీ ఔటయ్యాడని, దీని కారణంగానే అతడు డబుల్ సెంచరీ మిస్ అయ్యాడని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సంఘటనతో 74 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.

కెప్టెన్ గిల్ సెంచరీ, డిక్లరేషన్:
యశస్వీ రనౌట్ అయినప్పటికీ, కెప్టెన్ గిల్ సైతం ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో (100) చెలరేగాడు. గిల్ సెంచరీ పూర్తయిన వెంటనే, భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.మైదానంలో యశస్వీ ప్రదర్శించిన ఆగ్రహం, రనౌట్ వెనుక గిల్ పాత్రపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కెప్టెన్, వైస్-కెప్టెన్ మధ్య తలెత్తిన ఈ చిన్న విభేదం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+