Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓవర్ నైట్ స్టార్ డమ్- బెస్ట్ ఫినిషర్: ఎవరీ ముకుల్

ఐపీఎల్ లో మరో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడానికి చివరి బంతి వరకూ పోరాడింది లక్నో సూపర్ జెయింట్స్. మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో 21 ఏళ్ల ముకుల్ చౌదరి హీరోగా నిలిచాడు. అతను 27 బంతుల్లోనే అజేయంగా 54 పరుగులు చేసి మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పాడు. అతని ఐకానిక్ ఇన్నింగ్స్‌లో 7 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

ఒకాదశలో లక్నో జట్టు 128 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఆ సమయంలో కోల్‌కతా దాదాపు విజయం సాధించిందని భావించారు. ఇక్కడి నుంచే ముకుల్ చౌదరి పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఒత్తిడిలో అసాధారణ ప్రదర్శన చేశాడు. 17వ ఓవర్‌లో వైభవ్ అరోరా బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్ బాదాడు. ఆ తర్వాత 18వ ఓవర్‌లో కార్తీక్ త్యాగి బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

Young Gun Mukul Choudhary Shines Under Pressure Securing a Nail-Biting Victory for LSG with Dream Finish

19వ ఓవర్‌లో కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో కూడా ముకుల్ తగ్గలేదు. అదే ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. చివరి ఓవర్‌లో లక్నోకు 14 పరుగులు అవసరం అయ్యాయి. వైభవ్ అరోరా వేసిన మొదటి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీయగా, రెండో బంతిని ముకుల్ సిక్సర్‌గా మలిచాడు. తదుపరి రెండు బంతులు డాట్స్‌గా వెళ్ళాయి. అయిదో బంతికి ముకుల్ మరో సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా, ముకుల్ బ్యాట్‌కు బంతి తగల్లేదు. బై రూపంలో వచ్చిన సింగిల్‌తో లక్నో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు ముకుల్ చౌదరి. అతని స్వస్థలం రాజస్థాన్‌లోని ఝున్ ఝున్. మహేంద్ర సింగ్ ధోనీ అంటే విపరీత అభిమానం. అతని బ్యాటింగ్ స్టైల్ ను ఫాలో అవుతుంటాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో కూడా ఓ హెలికాప్టర్ షాట్ ఆడాడు. దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు ఫస్ట్ క్లాస్, అయిదు లిస్ట్- ఏ, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 17.16 సగటుతో 103 పరుగులు, లిస్ట్-ఏలో 14.20 సగటుతో 71 పరుగులు సాధించాడు.

టీ20 క్రికెట్‌లో 46.66 సగటు, 164.70 స్ట్రైక్ రేట్‌తో 280 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముకుల్ చౌదరి తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 57.66 సగటు, 198.85 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అతని అద్భుత ప్రదర్శనను గుర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ మినీ వేలంలో అతన్ని రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు గాను రూ. 2.60 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+