Yuvraj Singh:మృత్యువును జయించిన యోధుడు-యువీ ఎమోషనల్ స్టోరీ..!!

భారత క్రికెట్ చరిత్రలో ఎందరో వీరులు ఉండవచ్చు.. కానీ మృత్యువును జయించి, మైదానంలోకి సింహంలా తిరిగివచ్చిన అసలు సిసలు పోరాట యోధుడు మాత్రం యువరాజ్ సింగ్ మాత్రమే. 2011 ప్రపంచకప్ హీరోగా దేశమంతా పండగ చేసుకుంటున్న వేళ.. యువీ మాత్రం లోలోపల ఒక భయంకరమైన శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు.తాజాగా మైకేల్ వాన్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ పోరాటం గురించి పంచుకున్న హృదయ విదారక విషయాలతో కూడిన ఎమోషనల్ కథనం మీకోసం.

2011 ప్రపంచకప్.. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిన సమయం.ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచి భారత్‌కు కప్ అందించిన యువరాజ్ సింగ్,ఆ సమయంలో ఎంతటి నరకాన్ని అనుభవించాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.టోర్నీ ఆద్యంతం అలసట,వాంతులు,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా..దేశం కోసం వాటన్నింటినీ భరిస్తూ ఆడాడు.ఆ తర్వాత టెస్టులు చేయించుకుంటే తేలింది..అది సాదాసీదా అనారోగ్యం కాదు,భయంకరమైన క్యాన్సర్ అని.

yuvraj-singh-opens-up-on-cancer-battle-from-world-cup-hero-to-real-life-warrior-how-he-defeated-the

"క్రికెట్ ఆడతావా? లేక చస్తావా?"

రిపోర్టులు చూసిన డాక్టర్ చెప్పిన మాటలు యువీని కోలుకోలేని దెబ్బ తీశాయి. "నీ గుండె, ఊపిరితిత్తుల మధ్య ఒక పెద్ద ట్యూమర్ ఉంది. నువ్వు ఇలాగే మొండిగా క్రికెట్ ఆడితే నీకు హార్ట్ ఎటాక్ రావడం ఖాయం. ఒకవేళ నువ్వు కీమోథెరపీ చేయించుకోకపోతే.. నీకు కేవలం మూడు నుండి ఆరు నెలల సమయం మాత్రమే ఉంటుంది" అని డాక్టర్ నిర్మొహమాటంగా చెప్పేశారట. ఆ క్షణం యువరాజ్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది.

ఒక క్రీడాకారుడి మొండితనం..

"ఒక క్రీడాకారుడిగా మేం ఎప్పుడూ అనారోగ్యం గురించి ఆలోచించం. మా పని కేవలం దేశం కోసం ఆడటం మాత్రమే. నేను అనారోగ్యంతో ఉన్నానని అంగీకరించడానికే నాకు చాలా కాలం పట్టింది. ఆ ట్యూమర్ వల్ల నేను రోజురోజుకూ కృశించిపోతున్నా.. మొండిగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను" అని యువీ తన బాధను పంచుకున్నాడు. తాను స్వయంగా ఒక క్యాన్సర్ ఫౌండేషన్‌ను నడుపుతూ, ఇతరులకు అవగాహన కల్పిస్తూ.. తన విషయంలోనే దానిని గుర్తించలేకపోయాననే ఆవేదన అతని మాటల్లో కనిపించింది.

అసలు బతుకుతానా..?

అమెరికాలో కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో యువీ పడిన శారీరక, మానసిక వేదన వర్ణనాతీతం. "నేను మళ్ళీ క్రికెట్ ఆడగలనా? అసలు బతుకుతానా?" అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. కానీ యువీలోని పోరాట పటిమ ముందు ఆ క్యాన్సర్ తలవంచక తప్పలేదు. ఏడాది పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడమే కాకుండా, మళ్ళీ టీమ్ ఇండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టి అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించాడు.

యువరాజ్ సింగ్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక నిలువెత్తు స్ఫూర్తి. మృత్యువు ముంగిట నిలబడి కూడా 'మళ్ళీ ఆడతాను' అని చెప్పిన అతని ధైర్యం సామాన్యమైనది కాదు. అందుకే యువీని అభిమానులు ఇప్పటికీ "రియల్ ఛాంపియన్" అని పిలుచుకుంటారు. సిక్సర్ల వీరుడి ఈ ప్రయాణం తరతరాల క్రికెటర్లకు ఒక పాఠం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+